సినిమాల షూటింగ్ కోసం అయితే, ముందే వుంటుంది. కానీ, ప్రమోషన్లంటే చాలు హ్యాండిచ్చేస్తుంది.. అంటూ అనుపమ పరమేశ్వరన్‌పై టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ఇక అలాంటిదేం లేదంటూ, తాను రెండు సినిమాల షూటింగులతో డే అండ్ నైట్ షెడ్యూల్స్‌తో బిజీగా వున్న కారణంగా ప్రమోషన్లకు సరిగ్గా హాజరు కాలేకపోయానంటూ, 'కార్తికేయ 2' సినిమా ప్రమోషన్ల విషయమై సోషల్ మీడియా వేదికగా అనుపమ పరమేశ్వరన్ క్లారిటీ ఇచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.అయితే ఇక తాజాగా జరిగిన 'కార్తికేయ 2' సినిమా ప్రమోషన్లలో అనుపమా పరమేశ్వరన్ తళుక్కున మెరిసింది. వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్‌లో అచ్చు ఏంజల్‌ని తలపించేలా వుంది కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.ఆగస్టు 12 వ తేదీన రిలీజ్ కావల్సిన 'కార్తికేయ 2' సినిమాను తాజాగా వాయిదా వేస్తూ కొత్త డేట్ ని ప్రకటించారు. ఆగస్టు 13 వ తేదీన ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే క్రమంలో చిత్ర యూనిట్ ఓ ప్రెస్ మీట్ కూడా నిర్వహించింది.


ప్రెస్ మీట్‌లోనే అనుపమ పరమేశ్వరన్ తళుక్కున మెరిసింది. నిఖిల్‌తో కలిసి ఫోటోలకు చాలా క్యూట్‌గా పోజిచ్చింది అనుపమ పరమేశ్వరన్.కాగా, ఈ సినిమా విజయం ఇటు అనుపమకూ ఇంకా అలాగే అటు నిఖిల్‌కీ ఇద్దరికీ కూడా అత్యంత కీలకం. ఈమధ్య సినిమాలు క్లాష్ అవుతాయన్న కారణంగా, వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వచ్చారు 'కార్తికేయ 2' సినిమాని. దాంతో బోలెడంత సింపథీ కూడా వర్కవుట్ అయ్యింది నిఖిల్‌పై. ఖచ్చితంగా ఈ సినిమా విజయం సాధించాలని నిఖిల్ ఫ్యాన్స్ ఎంతో మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.అలాగే పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్న ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని కార్తికేయ 2 చిత్రబృందం వారు చాలా నమ్మకంగా వున్నారు. ఇక చూడాలి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: