సాధారణంగా సినిమాల్లో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు  నటిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ కొంతమంది మాత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా తన నటనతో ఆకట్టుకుంటారు. ఈ క్రమంలోనే అంతకుమించి అనే రేంజ్ లోనే పాపులారిటీ సంపాదించుకున్న వారు ఉన్నారు.  ఒకప్పుడు హీరోల చిన్నప్పటి పాత్రలో లేదా హీరోల కొడుకు కూతురు పాత్రలో నటించిన వారు ఇటీవల కాలంలో ఏకంగా హీరో హీరోయిన్లు ఎంత ఇస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. కొంతమంది ఇలా రీఎంట్రీ ఇచ్చి రాణిస్తూ ఉంటే మరికొంతమందికి అంతగా కలిసి రావడం లేదు.


 గతంలో ఇంద్ర సినిమాలో చిరంజీవి చిన్నప్పటి పాత్రలో నటించిన తేజ సజ్జ ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు. రాజన్న సినిమాలో నాగార్జున కూతురు గా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సైతం ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఇక ఇప్పుడు సంతోషం సినిమాలో కళ్ళద్దాలతో నాగార్జున కొడుకు గా కనిపించిన పిల్లోడు కూడా ఇప్పుడు హీరో మెటీరియల్ గా మారిపోయాడు అని తెలుస్తోంది. 2002లో దశరథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన సంతోషం సినిమా మంచి విజయాన్ని సాధించింది.


 ఈ సినిమా మొత్తం ఇక నాగార్జునతో పాటు పక్కనే కొడుకు పాత్రలో చిన్నపిల్లోడు కూడా కనిపిస్తాడు. కళ్ళద్దాలు పెట్టుకుని తన బుల్లి బుల్లి మాటలతో ఎంతగానో ప్రేక్షకులను ఆకర్షించాడు. అతని పేరు అక్షయ్ బచ్చు.  ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు చేయగా.. చదువుపై  దృష్టితో నటించి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి సినిమాలకు  దూరమయ్యాడు. ఇక తర్వాత బాలీవుడ్ సినిమాలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా మారిపోయాడు. అయితే ఇక ఈ చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది మాత్రం ఎవరికీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: