టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కళ్యాణ్ రామ్ ఆఖరుగా ఎంత మంచి వాడవురా సినిమా తో ప్రేక్షకులను పలకరించాడు . ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది .

ఇది ఇలా ఉంటే తాజా గా కళ్యాణ్ రామ్ 'బింబిసార' అనే మూవీ లో హీరోగా నటించాడు . ఈ సినిమా ఆగస్ట్ 5 వ తేదీన విడుదల కాబోతుంది . ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ సభ్యులు పలు ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమా ను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు . అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ ,  బాలకృష్ణ తో సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ... బాబాయ్ బాలయ్య తో తమ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో ఇటీవల ఒక మూవీ ని చేయాలి అని భావించాం ,  కానీ కొన్ని కారణాల వలన అది వీలు కాలేదు . తప్పకుండా రాబోయే రోజుల్లో తమ బ్యానర్ పై బాలయ్య బాబాయ్ తో అందరినీ మెప్పించే అదిరిపోయే స్థాయిలో ఒక భారీ సినిమా ఉంటుంద ని కళ్యాణ్ రామ్ తాజా ఇంటర్వ్యూలో తెలియ జేశాడు. ఇది ఇలా ఉంటే బింబిసార మూవీ కి మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించగా ,  సంయుక్త మీనన్ , క్యాథరిన్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు . ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె హరికృష్ణమూవీ ని నిర్మించారు .

మరింత సమాచారం తెలుసుకోండి: