నందమూరి నట సింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం విడుదల అయిన అఖండ సినిమాతో అదిరిపోయే విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకని ఫుల్ ఫామ్ లోకి వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. ఇలా అఖండ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుత తన కెరీర్ లో 107 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా , శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. దునియా విజయ్మూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా , వరలక్ష్మి శరత్ కుమార్మూవీ లో ఒక కీలక పాత్రలో  నటిస్తోంది. ఇప్పటి వరకు ఈ మూవీ కి చిత్ర యూనిట్ టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా ఎన్ బి కె 107 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ ను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక టీజర్ ను విడుదల చేయగా ,  ఈ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి మాత్రమే కాకుండా, సినిమాపై ఉన్న అంచనాలు కూడా అమాంతం పెంచేసింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ ను ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ మూవీ యూనిట్ విడుదల చేయనున్నట్లు ఒక న్యూస్ వైరల్ అవుతుంది. రాఖీ పౌర్ణమి రోజు ఈ సినిమా నుండి పోస్టర్ కానీ లేదా వేరే ఇంట్రెస్టింగ్ అప్డేట్ కానీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: