కొంతమంది హీరోలు కొన్ని సినిమాలలో చేసే పాత్రలు ప్రేక్షకులలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఉత్తమ ప్రదర్శన అందించి వారు ఆ పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను ఎంతో అలరించి ఉంటారు. అవే వారి కెరీర్ లలో బెస్ట్ పాత్రలుగా గుర్తుండిపోతాయి. అయితే హీరోలు ప్రేక్షకుల మదిలో గుర్తుండి పోయేలా చేసిన ఆ పాత్రను కేవలం వారు హీరోలుగా నటించే సినిమాల పాత్రలనీ మాత్రమే కాదు ఇతర సినిమాలలో చేసే కొన్ని ముఖ్యమైన పాత్రలు కూడా వారి కెరియర్ లో బెస్ట్ పాత్రలుగా మిగిలిపోతూ ఉంటాయి.

ఆ విధంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా తన సత్తా చాటి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న నాగచైతన్యబాలీవుడ్ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించడం నిజంగా అక్కినేని అభిమానులను ఎంతగానో ఆసక్తి పరుస్తుంది. ఇప్పటిదాకా తన సినిమాలలో తప్ప వేరే సినిమాలలో నటించని నాగచైతన్య ఈ సినిమాలో ఏ విధంగా నటించాడు అన్న ఆసక్తి ఎంతగానో ఉంది. అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన పాన్ ఇండియా సినిమా లాల్ సింగ్ చద్దా అన్ని భాషలలో రూపొందింది. ఇప్పటికే పలు అప్డేట్ల ద్వారా సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడగా ఆగస్టు 11వ తేదీన ఈ చిత్రం విడుదల జరుగుతున్న నేపథ్యంలోనే ఈ సినిమాలో బోడి బాలరాజు పాత్ర చేసిన అక్కినేని నాగచైతన్య ఆ పాత్రలో ఎంతో బాగా ఒదిగి పోయాడని చిత్ర బృందం చెబుతుంది.

తప్పకుండా ఈ పాత్ర కెరియర్ లోనే బెస్ట్ పాత్ర అవుతుందని వారు చెబుతున్నారు. గత పాత్రల తాలూకు ఛాయలు ఏ మాత్రం కనబడకుండా నాగచైతన్య ఎంతో కేర్ తీసుకుని మరి ఈ సినిమాను చేశాడని చెబుతున్నారు. మరి ఆయన పాత్ర ఈ చిత్రం యొక్క సక్సెస్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఇటీవల ఆయన హీరోగా నటించిన థ్యాంక్యూ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. దాంతో ఆయన చేస్తున్న ఈ సినిమా అయినా మంచి పేరు తీసుకు వస్తే అభిమానులు ఎంతో కొంత సంతోష పడతారు అని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: