ఎన్టీఆర్ హీరోగా రూపొందతున్న సినిమాలు ప్రస్తుతం మూడు ఉన్నాయి. వాటిలో ముందుగా కొరటాల శివ దర్శకత్వం లో సినిమా రూపొందుతుంది. ఇప్పటికే మొదలు కావాల్సిన ఈ సినిమా యొక్క షూటింగ్ వాయిదా పడడం ఎన్టీఆర్ అభిమానులను ఎంతగానో నిరాశపరిచిన కూడా ఒక మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జోరుగా కొనసాగిస్తున్నాడు కొరటాల శివ. ఆ విధంగా ఆగస్టు చివరి నుంచి ఈ సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలోని మిగతా నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

అయితే ఈ సినిమాతో పాటే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో చేయబోయే సినిమాను కూడా మొదలు పెట్టాల ని భావిస్తున్నాడు ఎన్టీఆర్ ఈ రెండు చిత్రాలను వచ్చేయడానికి విడుదల చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాడు 2023లో ఈ సినిమాలను విడుదల చేసి ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సన్నహాలు చేస్తున్నాడు ఎన్టీఆర్ ఆ విధంగా ఈ మూడు చిత్రాల ద్వారా మళ్లీ తన సత్తా చాటే విధంగా ఎన్టీఆర్ అడుగులు వేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించిన ఈ హీరో ఇప్పుడు ఈ మూడు సినిమాలను కూడా ఫ్యాన్ ఇండియా స్థాయిలో చేస్తూ మరొకసారి తన సత్తాను చాటబోతున్నాడు.

 మరి ఈ చిత్రాలు ఏ విధంగా సక్సెస్ను తెచ్చిపెడతాయి చూడాలి. ఈ చిత్రంతో ఏ విధంగా కం బ్యాక్ చేస్తాడు అనే ది ఇక్కడ అసలు విషయం. ఎన్టీఆర్ సినిమా చేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. చాలా రోజుల నుంచి ఈ సినిమాపై కసరతులు చేస్తున్న బుచ్చిబాబు తప్పకుండా మంచి సినిమాను అభిమానులకు కానుకగా అందించాలని ఆశతో ఉన్నాడు. ఇక మాస్ చిత్రాలకు పెట్టింది పేరుగా ఉన్న ప్రశాంత్ నీల్ ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: