నందమూరి పెద్ద వారసుడు హీరో కళ్యాణ్ రామ్ నుంచి రానున్న బింబిసార సినిమాపై అంచనాలు అనేవి ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేసు. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ గా రాబోతున్న ఈ సినిమా ఆగస్టు 5 వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది.ఈ బింబిసార సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు.ఇక నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బింబిసార, వశిష్ట్ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ హిస్టారికల్ మూవీ రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు.అలాగే ఒక స్పెషల్ సాంగ్ లో వరీనా హుసేన్ కూడా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బింబిసార అనే పవర్ ఫుల్ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించనున్నాడు. దానికి తగ్గట్టుగానే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్ ఇంకా సాంగ్స్ సినిమా పై అంచనాలు భారీగా పెంచేశాయి.


ఇక ఇటీవలే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చూసిన తరువాత మాట్లాడిన మాటలు సినిమా మీద మరింత అంచనాలు పెంచాయి.ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా రేపు ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై కొసరాజు హరికృష్ణ నిర్మించారు. కీరవాణి  ఈ చిత్రానికి సంగీతం అందించగా వెన్నెల కిశోర్ ఇంకా శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలలో నటించారు. కల్యాణ్ రామ్ 'బింబిసారా' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో రూ. 5 కోట్లు ఇంకా సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి మొత్తం రూ. 6.50 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే..ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తంగా రూ. 13.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. వరల్డ్ వైడ్ గా 15 కోట్లు అయ్యింది.ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులు భారీ రేటుకు జీ తెలుగు సంస్థ దక్కించుకుందని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: