ఇక అభిమానులే దర్శకులు అయితే ఎలా ఉంటుందో ఇప్పటికే 'ఠాగూర్' తో వినాయక్,'సింహా' తో బోయపాటి, 'సర్కారు వారి పాట' తో పరశురామ్ ఇంకా అలాగే 'విక్రమ్' తో లోకేష్ కనగరాజన్ వంటి వారు చూపించారు.కేవలం తమకు ఇష్టమైన హీరోని డైరెక్ట్ చేయడం కోసమే సినీ ఫీల్డ్ పై ప్రేమని పెంచుకుని ఇందులో ఎంటర్ అయ్యి ఎన్నో కష్టాలు అవమానాలు పడి చివరికి తమ అభిమాన హీరోతో సినిమా చేసే స్థాయికి వెళ్లారు ఈ దర్శకులు అందరూ.అయితే 'కార్తికేయ' 'ప్రేమమ్' చిత్రాల దర్శకుడు చందూ మొండేటి కూడా నాగార్జునకి చాలా పెద్ద వీరాభిమాని. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో కూడా అతను తెలియజేశాడు. నాగ చైతన్యతో చేసిన 'ప్రేమమ్' చిత్రంలో నాగార్జున చిన్న గెస్ట్ రోల్ ఇవ్వడం కూడా జరిగింది. చందూ ఆల్రెడీ నాగ చైతన్యతో రెండు సినిమాలు కూడా తీశాడు. మరి నాగార్జున తో సినిమా ఎప్పుడు అనే ప్రశ్నకు అతను సమాధానం చెప్పకుండా చాలా సార్లు కూడా కథ సెట్ అవ్వాలి అంటూ మాట దాటేశాడు.


ఇక చందూ మొండేటి ఈ విషయంపై స్పందించి ఓ క్లారిటీ  కూడా ఇచ్చేశాడు.కింగ్ నాగార్జున గారి కోసం 'విక్రమ్' లాంటి సినిమా తీస్తాను.ఆల్రెడీ ఆయన కోసం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ రెడీ చేసి వినిపించాను. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయిన తరువాత అతి త్వరలోనే మేము ఈ సినిమా స్టార్ట్ చేస్తాము అని చందూ చెప్పాడు.'కార్తికేయ2' సినిమా హిట్ అయితే చందూ నాగ్ సినిమా పనులు మొదలుపెడతానని చెప్పుకొచ్చాడు. నాగార్జున కూడా యంగ్ డైరెక్టర్స్ తో పని చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం 'ఘోస్ట్' చిత్రంలో నటిస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు నాగ్.ఈ సినిమాకి 'చందమామ కథలు', 'గుంటూరు టాకీస్', 'గరుడ వేగ' లాంటి సినిమాలు తీసి మెప్పించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: