పెళ్ళయ్యాక సినిమాల్లో నటించాను.. తల్లయ్యాక కూడా సినిమాల్లో నటిస్తాను .. వచ్చేస్తున్నా, మళ్ళీ వచ్చేస్తున్నా.. అంటోంది అందాల చందమామ కాజల్ అగర్వాల్.


కోవిడ్ సమయంలో పెళ్ళి పీటలెక్కిన కాజల్ అగర్వాల్, అప్పట్లో 'ఆచార్య' సినిమాలో నటించిందిగానీ, ఆ సినిమాలో ఆమె పాత్రను ఆ తర్వాత కట్ చేసిన విషయం తెలిసిందే.


ఈ విషయమై ఇప్పటికీ రాద్ధాంతం కొనసాగుతూనే వుంది. అయితే, ఇంతవరకు కాజల్ అగర్వాల్ 'ఆచార్య'లో తన పాత్ర తొలగింపుపై అస్సలు స్పందించలేదు. సినిమాలో నటించకపోయినా, రెమ్యునరేషన్ మాత్రం ఆమె బాగానే అందుకుందట.

ప్రముఖ దర్శకుడు శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో 'భారతీయుడు-2' (ఇండియన్-2) సినిమా గతంలోనే ప్రారంభమయ్యింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలకుగాను ఎంపికయ్యారట.. కొంతమేర షూటింగ్ కూడా జరిగింది.


అనివార్య కారణాల వల్ల 'ఇండియన్-2' సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోగా, అది మళ్ళీ సెప్టెంబర్‌లో పునఃప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. 'సెప్టెంబర్ నుంచి మళ్ళీ భారతీయుడు 2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటాను' అంటూ తాజాగా కాజల్ వ్యాఖ్యానించడం విశేషం 


కాజల్ ప్లేస్‌లో దీపికా పడుకొనే, కత్రినా కైఫ్ పేర్లను పరిశీలిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న వేళ, తాను ఆ ప్రాజెక్టులో వున్నానంటూ కాజల్ క్లారిటీ ఇవ్వడంతో 'చందమామ' అభిమానులు తెగ పండగ చేసుకుంటున్నారట. కాజల్ స్క్రీన్ పై కనిపించి సంవత్సరం కావస్తుంది. తను పెళ్లి అయినా తల్లి అయినా కానీ నటిస్తూనే వుంటాను అంటుంది. ఇటీవలే కాజల్ కు కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. కాజల్ తన కొడుకుకు నీల్ అని ముద్దుగా పేరు కూడా పెట్టుకుంది. మాతృత్వపు మాధుర్యం కాజల్ ప్రస్తుతం పొందుతుంది. తను మంచి తల్లి అయ్యేలాగా కృషి చేస్తాను అని చెప్పుకొచ్చింది.ప్రస్తుతానికి ఇండియన్ 2 సినిమాలో నటించ బోతుంది. తరువాత తను చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి త్వరలో వెళ్లడిస్తాను అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: