ప్రస్తుతం తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్న మూవీ లలో బింబిసార మూవీ ఒకటి. ఈ మూవీ లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించగా , ఈ మూవీ కి మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ , క్యాథరిన్ హీరోయిన్ లుగా నటించారు.

మూవీ రేపు అనగా ఆగస్ట్ 5 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ సినిమా బృందం వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమా ఫుల్ గా ప్రమోట్ చేస్తున్నారు.  ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉండటం , అలాగే ఈ మూవీ నుండి మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉండటం తో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉండటం వల్ల ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్ లలో  విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం.

నైజాం : 232 , సీడెడ్ : 130 , ఆంధ్ర : 320 . రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి బింబిసార మూవీ 685 థియేటర్ లలో విడుదల కాబోతుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 80 , ఓవర్ సీస్ లో 210 ప్లస్ . ప్రపంచ వ్యాప్తంగా బింబిసార మూవీ 975 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: