ఇక వైజయంతి మూవీస్ బ్యానర్‌లో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ ఇంకా మలయాళంలో ఒకేసారి ఇవాళ ప్రేక్షకుల ముందుకురాగా విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొనగా ఆ అంచనాలను దుల్కర్ సల్మాన్ అందుకున్నాడా లేదా చూద్దాం..


ఇక సినిమా కథ విషయానికి వస్తే.. లెఫ్టినెంట్ రామ్ (దుల్కర్ సల్మాన్) ఇండియన్ ఆర్మీలో పనిచేసి ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోలో చేరుతాడు. రామ్ ఒక అనాథ. అయితే అతడి మాటతీరుతో ప్రజల మనసులను గెలుచుకుంటారు. ఈ క్రమంలో కొంతమంది అతడికి లేఖలు కూడా రాస్తారు. ఇక ఇందులో ఒక అమ్మాయి సీతా మహాలక్ష్మి (మృణాల్ ఠాకూర్), రామ్‌ని తన భర్తగా సంబోధిస్తుంది. సీన్ కట్ చేస్తే ఈ సీతా మహాలక్ష్మి ఎవరు? అసలు కథ ఏంటీ? చివరకు ఎలా సుఖాంతం అయిందనేదే ఈ సినిమా స్టోరీ.


ఇక ఈ సినిమాలో దుల్కర్,మృణాల్ నటన,సెకండాఫ్,క్లైమాక్స్‌ ఇంకా సాంకేతిక విభాగం. ముఖ్యంగా తన పాత్రలో ఒదిగిపోయాడు దుల్కర్‌ సల్మాన్. రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో అతను చక్కగా నటించాడు. ఇక దుల్కర్‌తో బాగా పోటీపడి నటించింది మృణాల్. ఆ కాలపు సంప్రదాయ వస్త్రధారణలో చాలా అందంగా ఇంకా అద్భుతంగా కనిపించింది. ఇక సినిమాకు గ్లామర్ పరంగా రష్మికాని కాకుండా వేరే హీరోయిన్ ని పెట్టి ఉంటే చాలా బాగుండేది. మిగితా పాత్రల్లో సుమంత్,వెన్నెల కిషోర్ ,మురళీ శర్మ, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రియదర్శి ఇంకా రాహుల్ రవీంద్రన్ తమ పరిధి మేరకు అలరించారు.


ఫీల్ గుడ్ లవ్‌ స్టోరీ సీతా రామం. ఫస్టాఫ్ సంగతి పక్కన పెడితే సెకండాఫ్‌ అయితే అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. రహస్య మిషన్ తర్వాత జరిగే సంఘటనల తర్వాత వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఇంకా భావోద్వేగాలతో కట్టిపడేస్తాయి. ఓవరాల్‌గా అందమైన ప్రేమకావ్యం సీతా రామం సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: