ప్రపంచ సుందరి హర్నాజ్ సంధు కు తాజాగా లీగల్ నోటీసులు అందడం జరిగింది. తమ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడం లేదని ఆమెతో జరిగిన ఒక ఒప్పందాన్ని ఉల్లంఘించిందని.. ఆరోపిస్తూ పంజాబ్ నటి అయిన ఉపాసన చండీగఢ్ కోర్టులో కేసు వేయడం జరిగింది తనకు జరిగిన నష్టం పైన పరిహారం చెల్లించాలని కూడా అందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆమె పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. దీంతో పంజా సినీ ఇండస్ట్రీలో పెను దుమారంగా మారుతుంది ఈ విషయం. సంతోష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఉపాసన బై జీ కుట్టంగే అనే చిత్రాన్ని ఉపాసన నిర్మించింది.


ఈ సినిమాలో హర్నాజ్ సన్షు ముఖ్యమైన పాత్రలో నటించారు అయితే మిస్ యూనివర్సిటీ కాకముందు ఈమె ఇందులో నటించింది. కానీ ఇప్పుడు ఆమె తన సినిమా ప్రమోషన్లలో పాల్గొనలేదని ఉపాసన తెలియజేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడటం.. నేను హర్నాజ్ సందు కీ మిస్ యూనివర్స్ కాకముందే..బై జీ కుట్టంగే చిత్రంలో అవకాశం ఇచ్చానని అంతేకాకుండా.. యూరా దియన్ పూ బరన్ సినిమాలో కూడా ఈమెను కథానాయక ఎంపిక చేశానని ఈ సినిమా కోసం హరి బడ్జెట్ ని కేటాయించాలని తెలియజేసింది అంతేకాకుండా ఈ సినిమా మే 27న విడుదల కావాల్సి ఉండగా. హర్నజ్ కోసమే ఈ సినిమాను ఆగస్టు 19 కి వాయిదా వేయవలసి వచ్చింది అని తెలియజేసింది.


అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కోసం తన డేట్స్ ఇవ్వడానికి ఆమె నిరాకరిస్తోందని.. పంజాబ్ సినీ ఒప్పందాన్ని ఆమె ఉల్లంఘించినందుకు ఆమె పైన చర్యలు తీసుకోవాలని ఉపాసన తెలియజేసింది. ఈ చిత్రానికి స్వీప్ కాంగ్ దర్శకత్వం వహించారు. ఇక ఉపాసన ఆరోపణలపై హర్నాజ్ సందు స్పందించలేదని తెలియజేసింది. ఇక దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారని విషయం పై పంజాబ్ సినీ ప్రేక్షకులు చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: