టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోయిన్ లలో ఒకరు అయినా రాశి కన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి మూవీ తోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకుంది.

ఆ తర్వాత వరుస పెట్టి అనేక టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రాశి ఖన్నా అతి తక్కువ కాలంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో నటించిన తెలుగు సినిమాలు అన్నీ కూడా వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.  కొంతకాలం క్రితం రాశి ఖన్నా, విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న రాశి కన్నా తాజాగా గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ తో మరో సారి ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా రాశి కన్నా 'థాంక్యూ' మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో నాగ చైతన్య హీరోగా నటించగా విక్రమ్ కె కుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోవడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న రాశి ఖన్నా గత కొంత కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటూ తన అభిమానులను నిరుత్సాహపరుస్తూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: