అక్కినేని చైతన్య ప్రస్తుత లాల్ సింగ్ చద్దా సినిమా త్వరలోనే విడుదలవుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు చైతన్య. ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోని సినిమా ప్రమోషన్లలో భాగంగా వాళ్ళు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు చైతన్య. ఇక ఈ క్రమంలోనే సమంత వివాహం విడాకుల గురించి అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి అందుకు తగ్గట్టుగా సమాధానం తెలియజేశారు చైతన్య ఇక ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ఇటీవల తనకు ఆన్ స్క్రీన్ మీద కెమిస్ట్రీ మాత్రం సాయి పల్లవి, సమంతతో బాగా ఉంటుందని తెలియజేశారు చైతన్య.. ఇక ఇప్పుటికి కూడ సమంత తనకు మధ్య అపారమైన గౌరవం ఉందని తెలియజేశారు. తన వ్యక్తిగత జీవితం వృత్తిపరమైన జీవితాన్ని కలిసి నిర్వహించడం నేర్చుకున్నారా అనే ప్రశ్న ఎదురైంది..? చైతన్య చిరునవ్వుతో రిప్లై ఇవ్వడం జరిగింది. నేను అదే చెబుతున్నాను కాబట్టి ప్రస్తుతం ఇలా ఉన్నాను వ్యక్తిగత జీవితానికి వృత్తిపరమైన జీవితానికి ఒక స్పష్టమైన రేఖను కూడా గీయాలి. ఎలాంటి విషయాన్ని అయినా సరే వార్తలను వార్తలే భర్తీ చేస్తాయి ఇవాళ ఒకటి.. రేపు మరొకటి వినిపిస్తూ ఉంటాయి. అందుచేతనే మనం ఏం చేయాలనుకుంటున్నామో దానిపైన దృష్టి పెట్టాలి అని తెలిపారు.

విడాకులు తీసుకున్న తర్వాత తనపై సమంతపై వస్తున్న వార్తలపై నాగచైతన్య మాట్లాడడం జరిగింది మేము ఇద్దరం మా స్టేట్మెంట్లను తెలియజేశాము మాకు ఒకరి పైన మరొకరికి అమితమైన గౌరవం ఉన్నదని తెలిపారు. మా గురించి మేము మా వద్ద ఉన్నది తెలియజేశాము కానీ అంతకుమించి మా మధ్య ఉన్న దాన్ని ఏ విధంగా తెలియజేయలేము. తామిద్దరిపైన వస్తున్న వార్తలతో విసుగు చెందామని తెలియజేశారు 4 ఏళ్ల వివాహ బంధానికి గత సంవత్సరం అక్టోబర్ -2 గుడ్ బై చెప్పారు చైతన్య సమంత. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: