మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, సునీల్, అంజలిమూవీ లో ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీ లో దర్శకుడు మరియు నటుడు అయినటువంటి ఎస్ జె సూర్య ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా భాగం షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. అలా ఇండియా వ్యాప్తంగా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండడానికి ప్రధాన కారణం ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ విజయం తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడం, దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయిన శంకర్మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇలా పాన్ ఇండియా రేంజ్ లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా గురించి కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య తాజాగా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. తాజాగా సూర్య దేశం అంతా కూడా శంకర్ తదుపరి మూవీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంది అని కామెంట్ చేశాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింతగా అంచనాలు పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: