టాలీవుడ్ సీనియర్ హీరో లలో ఒకరు అయినా రాజ శేఖర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అల నాటి కాలం లో రాజ శేఖర్ ఎన్నో హిట్ ,  సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు .

అలా అల నాటి కాలంలో ఎన్నో విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న రాజ శేఖర్ కొన్ని సంవత్సరాలుగా వరుస అపజయాలతో బాక్సా ఫీస్ దగ్గర డీలా పడిపోయిన సందర్భం లో గరుడ వేగ మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకని తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు . గరుడ వేగ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత రాజ శేఖర్ ఇప్పటికే కల్కి మరియు శేఖర్ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు . ఈ రెండు మూవీ లు కూడా బాక్సా ఫీస్ దగ్గర పెద్ద విజయాలను అందుకోలేక పోయాయి . ఇది ఇలా ఉంటే రాజ శేఖర్ కొత్త సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది .  

పవన్ సాధినేని దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో రాజశేఖర్ నటించబోతున్నట్లు సమాచారం . ఈ దర్శకుడు ఇది వరకు ప్రేమ ఇష్క్ కాదల్ , సావిత్రి  అని మూవీ లకు దర్శకత్వం వహించాడు . ఈ రెండు మూవీ లు కూడా  ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేక పోయాయి . పవన్ సాధినేని దర్శకత్వం  లో తెరకెక్కబోయే మూవీ లో రాజ శేఖర్ నటించబోతున్నట్లు , వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కి మార్కాపురం శివకుమార్ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: