ప్రముఖ మాలీవుడ్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా.. రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తూ తెరకెక్కిన చిత్రం సీతారామం. ప్రేక్షకుల కోసం నిన్న ఉదయం ప్రీమియర్ షో వేసిన విషయం తెలిసిందే. ఇక మొదటి షో తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా నిన్న సాయంత్రం విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడం గమనార్హం. ముఖ్యంగా యుద్ధం రాసిన ఈ ప్రేమ కథను హృదయంతో చూడాలంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.ముఖ్యంగా ఈ సినిమా 1965 నుండి 1985 మధ్య కాలంలో జరిగిన ప్రేమ కథ సీతారాం. సినీ ప్రేక్షకులంతా కూడా ఈ ప్రేమ కథకు ఫిదా అవ్వడమే కాకుండా సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ చూసి అందరూ ఆశ్చర్యంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఒక సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అంటే ఇక ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది అని అంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే సీతారామం సినిమా కూడా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది అనే విషయంపై తెగ ఆసక్తి చూపుతుంటారు. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీని డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే సినిమా విడుదలైన ఆరు వారాల తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుందని స్పష్టం చేశారు.


ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో లెఫ్టినెంట్ రామ్ గా చాలా అద్భుతంగా నటించారు. ఇక సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ నటించగా నేషనల్ కృష్ రష్మిక కాశ్మీర్ ముస్లిం పాత్రలో పూర్తిగా జీవించేసింది. ఇక మొదటిసారి సుమంత్ నెగిటివ్ పాత్రలో కనిపించినా.. అతని మార్పు సినిమాకి హైలెట్గా అనిపిస్తుంది అని చెప్పవచ్చు ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: