తాజాగా విడుదలైన సీతారామం చిత్రం ద్వారా ప్రేక్షకులకు వచ్చాడు హీరో దుల్కర్ సల్మాన్. మరొకసారి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. సీతారామం సినిమాలో దుల్కర్ సల్మాన్ లుక్స్ నటన ప్రేక్షకులను ఫిదా అయ్యేలా చేస్తుంది మలయాళం స్టార్ హీరోయిన్ కూడా తెలుగు హీరోల ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు తెలుగులో ఇకనుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది దుల్కర్ సల్మాన్.తన కొత్త సినిమా కింగ్ ఆఫ్ కోత ను పట్టాలెక్కించేందుకుగాను ప్రస్తుతం సిద్ధమయ్యారు. సీతారామం చిత్రం కోసం ఒక నెలరోజుల పాటు తన సమయాన్ని చాలా బిజీగా గడిపారు దుల్కర్ సల్మాన్. అయితే ఈ నెల విశ్రాంతి తీసుకుని వచ్చే నెల నుండి తన కొత్త సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. కింగ్ ఆఫ్ కోత అనే చిత్రానికి డైరెక్టర్గా అభిలాష్ జోషి దర్శకత్వం వహించబోతున్నారు ఈ సినిమాల దుల్కర్ సల్మాన్ కు జోడిగా స్టార్ హీరోయిన్ సమంత ఎంపిక చేశారని వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. మహానటి సినిమాలో వీరిద్దరూ కలిసి వాళ్ళ అలరించారు.


ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా కూడా రాలేదు. ఇప్పుడు తాజాగా కింగ్ ఆఫ్ కోత అనే సినిమాలో మాత్రం వీరిద్దరూ కలిసి లవ్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలలో నటించేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఇప్పటివరకు తెలుగు తమిళ హిందీ వంటి భాషలలో నటించిన దుల్కర్ సల్మాన్ కోసం మొదటిసారిగా మలయాళం సినిమాలు నటించేందుకు సిద్ధమైందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానుల సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఇంకా కోత సినిమాతో సమంత ఎంట్రీ కచ్చితంగా పాన్ ఇండియా మార్కెట్ ను పెంచే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టుగా ఆమె అభిమానుల సైతం భావిస్తున్నారు. మరి ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: