ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని వేదిస్తున్న ప్రధాన సమస్య రోజురోజుకు పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం. ఈనిర్మాణ వ్యయంలో ఎక్కువ శాతం హీరోలకు ఇచ్చే పారితోషికాలు అన్నవిషయం ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు ఈసమస్యకు ఏదోవిధంగా పరిష్కారం ఆలోచించాలి అన్న ఉద్దేశ్యంతో టాలీవుడ్ లో షూటింగ్ ల బంద్ కు పిలుపు ఇచ్చారు.


అయితే ఈ బంద్ వల్ల హీరోలలో కదలిక వచ్చి తమ పారితోషికాలు ఎంతవరకు తగ్గించుకుంటారు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ లు ‘లైగర్’ మూవీ విషయంలో ఇప్పటికే అడుగులు వేసారు అన్న సంకేతాలు వస్తున్నాయి. పూరీ విజయ్ ల కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న మూవీ ‘లైగర్’


మూవీ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ కోసం చాల భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు. సాధారణంగా పూరీ సినిమాలలో భారీ సెట్స్ ఉండవు అయితే దీనికి భిన్నంగా ‘లైగర్’ మూవీలో భారీ సెట్స్ వేసారు. దీనికితోడు భారీ తారాగణం ఈమూవీలో నటిస్తూ ఉండటంతో ఈమూవీ బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో విజయ్ దేవరకొండ అదేవిధంగా పూరీ ఈమూవీ కోసం పారితోషికాలు తీసుకోకుండా కేవలం ఈమూవీకి వచ్చే లాభాలలో వాతలు తీసుకుంటున్నట్లు టాక్.


ఈమూవీకి ఏర్పడిన క్రేజ్ రీత్యా జరుగుతున్న భారీ బిజినెస్ వల్ల విజయ్ కు అదేవిధంగా పూరీకి చెరొక 75 కోట్ల పారితోషికం లాభాల రూపంలో వచ్చింది అని అంటున్నారు. ఇప్పుడు ఈవార్తలే నిజం అయితే మన టాప్ హీరోలు కూడ భారీ పారితోషికాలు తీసుకోకుండా ఇలా లాభాలలో వాటాలు తీసుకుంటే భారీ సినిమా నిర్మాతలకు ఎటువంటి కష్టాలు ఉండవు అన్న అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ సూత్రాన్ని మన టాప్ హీరోలు ఖచ్చితంగా అనుసరిస్తే ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కుంటున్న సమస్యలకు పరిష్కారం దొరికినట్లే అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: