సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి సినిమా గురించి, ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర చేసిన సందడి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు గుర్తు చేయవలసిన చేయాల్సిన అవసరం లేదు. 2006 వ సంవత్సరంలో విడుదలయిన పోకిరి సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి బాక్సా ఫీస్ దగ్గర ఎన్నో కొత్త కొత్త రికార్డ్ లను సృష్టించింది.

సినిమా మహేష్ బాబు కెరీర్ లో కూడా అద్భుతమైన విషయాలలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ ప్రతి నాయకునిగా పాత్రలో నటించగా, మణిశర్మమూవీ కి సంగీతాన్ని అందించాడు. మణిశర్మమూవీ కి అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీ రోల్ ని పోషించింది. వైష్ణో అకాడమీ , ఇందిరా ప్రొడక్షన్స్ సంస్థలు ఈ మూవీ ని ఎంతో భారీ స్థాయిలో నిర్మించారు. ఇలా ఆ సమయంలో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి కలెక్షన్ ల వర్షం కురిపించిన పోకిరి సినిమా ఆగస్ట్ 9 వ తేదీన సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా యొక్క 4 కె డిజిటల్ వర్షన్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో ,  ఓవర్సీస్ లోని కొన్ని ముఖ్య ప్రాంతాల్లో కొన్ని స్పెషల్ షో లు వేస్తున్నారు.

ఇందుకు సంబంధించిన టికెట్ లు ఫుల్ స్పీడ్ లో అమ్ముడు పోతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా హైదరాబాద్ లోని ఏ ఎం బి సినిమాస్ లో ఆగస్ట్ 9 వ తేదీన సాయంత్రం 7 గంటల స్పెషల్ షో కి సంబంధించిన టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేయగా కేవలం రెండు నిమిషాల్లోనే మొత్తం టికెట్స్ కూడా అమ్ముడయ్యాయి. దీనితో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన పోకిరి మూవీ స్పెషల్ షో ని చూడడానికి ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఆసక్తి చూపిస్తున్నారో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: