యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తాజాగా ది వారియర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా , ఆది పినిశెట్టి ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. తమిళ దర్శకుడు లింగుసామి ఈ మూవీ కి దర్శకత్వం వహించగా, దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.

సినిమా జూలై 14 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయ్యింది. ది వారియర్ మూవీ తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకే రోజు విడుదల అయ్యింది. ఈ మూవీ లో రామ్ పోతినేని మొట్ట మొదటి సారి కెరియర్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడం , తమిళ క్రేజీ దర్శకుడు లింగుసామి ఈ మూవీ కి దర్శకత్వం వహించడం, అలాగే ఈ సినిమా విడుదలకు ముందు ఈ చిత్ర బృందం ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై రామ్ పోతినేని అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను బాక్సా ఫీస్ దగ్గర మెప్పించలేక పోయింది.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి బుల్లెట్ అనే వీడియో సాంగ్ ని మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా విడుదలకు ముందు ది వారియర్ మూవీ నుండి విడుదల చేసినది బుల్లెట్ లిరికల్ వీడియో సాంగ్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. మరి తాజాగా విడుదల చేసిన బుల్లెట్ వీడియో సాంగ్ కి ప్రేక్షకులను ఏ మేరకు  అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: