కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ బింబిసార పై మొదటి నుండి అందరిలో మంచి అంచనాలే ఉన్నాయి. కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో ఫస్ట్ టైం ఈ మూవీతో సోషియో ఫాంటసీ జానర్ ఎంచుకున్నారు. యువ దర్శకుడు మల్లిడి వశిష్ట తీసిన ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మించింది. ఇక ఈ మూవీలో ఆయన త్రిగర్తల రాజ్యాన్ని పాలించే రాజు బింబిసారుడి పాత్రలో కనిపించారు. వరీన హుస్సేన్, క్యాథరీన్, సంయుక్తా హీరోయిన్స్ గానటించిన బింబిసార ట్రైలర్ విడుదల తరువాత మరింతగా అంచనాలు ఏర్పరిచింది.

ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ అయితే ఈ మూవీ  భారీ సక్సెస్ కొట్టి హీరోగా కళ్యాణ్ రామ్ కి పెద్ద బ్రేక్ ని అందించడం ఖ్యాం అని భావించారు. ఇక విడుదల తరువాత అందరి అంచనాలు మించేలా ఆకట్టుకున్న బింబిసార ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో సూపర్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్స్ తో కొనసాగుతోంది. హీరో కళ్యాణ్ రామ్ సూపర్ పెర్ఫార్మన్స్ తో పాటు ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా కథ, కథనాలతో మూవీ ని ఎంతో బాగా నడిపించారు దర్శకుడు వశిష్ట. మొత్తంగా ప్రస్తుతం దూసుకెళ్తున్న బింబిసార తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 6.5 కోట్ల షేర్ ని కొల్లగొట్టడం విశేషం అనే చెప్పుకోవాలి.

మరోవైపు రెండో రోజు కూడా ఈ మూవీకి ఎక్కడా కూడా అసలు డ్రాప్స్ లేవని, దీనిని బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో బింబిసార కలెక్షన్స్ తో అరాచకం సృష్టించి బాక్సాఫీస్ విధ్వంశం చేసే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు .కాగా అతి త్వరలో ఈ మూవీకి సీక్వెల్ గా బింబిసార 2 ని మరింత బాధ్యత తో ఎంతో గ్రాండ్ లెవెల్లో రూపొందిస్తాం అని, అలానే అది కూడా తప్పకుండా ఆడియన్స్ ని రీచ్ అయ్యేలా యూనిట్ మొత్తం మరింతగా కష్టపడుతుందని అంటున్నారు కళ్యాణ్ రామ్.

మరింత సమాచారం తెలుసుకోండి: