నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి అన్న టాక్ బయటకు వచ్చింది. ఒక సినిమా మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంటే మరొక సినిమా క్లాస్ ప్రేక్షకులను వేరే లెవెల్ లో అలరిస్తుందని చెబుతున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబి సారా చిత్రం చారిత్రాత్మక నేపథ్యంలో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ఇప్పుడు ఆ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ ను బట్టి తెలుస్తుంది. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండడానికి ముఖ్య కారణం కళ్యాణ్ రామ్ అనే చెప్పాలి.

చాలా రోజుల తర్వాత ఈ హీరోకి ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ రావడం విశేషం. సరికొత్త జోనర్ కావడంతో ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి కనబరిచారు. దానికి తోడు కళ్యాణ్ రామ్ అద్భుతమైన నటన కథ స్క్రీన్ ప్లే పట్ల మంచి ట్విస్టులు ఉండడంతో ఈ చిత్రం ఇంతటి స్థాయిలో ప్రేక్షకులను అలరించగలుగుతుంది. మరి ఈ సినిమా భవిష్యత్తులో ఇంకెన్ని రికార్డులను సాధిస్తుందో చూడాలి. 

ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా కూడా నిన్న విడుదల అయింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మిక మందన మరియు మృనాల్ ఠాకూర్ కథానాయికలుగా నటించారు. ప్రేమ కథ సినిమాగా మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన ఈ సినిమా క్లాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తెలుగులోకి వచ్చి చాలా రోజులే అయిపోయిన నేపథ్యంలో ఈ చిత్రం తప్పకుండా ఆ వర్గం ప్రేక్షకులను బాగా అలరిస్తుందని ముందు నుంచే అందరూ చెప్పారు. ఆ విధంగా ఈ చిత్రం అందరినీ ఆకట్టుకోవడం నిజంగా తెలుగు సినిమా పరిశ్రమకు గడ్డుకాలం పోయిందని చెప్పాలి. మరి ఈ రెండు చిత్రాల తర్వాత వచ్చే సినిమాలు దీనిని కొనసాగిస్తాయా అనేది చూడాలి. వచ్చేవారం కార్తికేయ మాచర్ల నియోజకవర్గం అనే రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ఆ తర్వాత పాన్ ఇండియా సినిమా లైగర్ విడుదల కాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: