టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకుడు సుకుమార్ ఎలాంటి చిత్రాలను తెరకెక్కిస్తా డో అందరికీ తెలిసిందే.  మాస్ ప్రేక్షకులలో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. మొదట్లో ఇంటలిజెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ దర్శకుడు రంగస్థలం సినిమాతో మాస్ బాట పట్టాడు. అంతకు ముందు పెద్ద హీరోలతో సైతం మంచి క్లాసికల్ సినిమాలను తెరకెక్కించి విజయాలు అందుకున్న ఈ హీరో ఆ తర్వాత మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ సినిమాలు చేసి ఇప్పుడు మాస్ దర్శకుడుగా అలరిస్తున్నాడు.

ఆ విధంగా ఆయన చేసిన రంగస్థలం పుష్ప సినిమాలు సంచలన విజయాన్ని అందుకో గా హీరోతో సమానంగా ఆయనకు ఆ చిత్రాలు ఫాలోయిం గ్ తెచ్చిపెట్టాయి. ఇప్పుడు పుష్ప యొక్క రెండవ భాగం సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమాపై కూడా ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. చాలా రోజులే అవుతున్న ఈ చిత్రం యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికీ పూర్తవడం బన్నీ అభిమానులలో ఎంతో సంతోషాన్ని తీసుకువస్తుంది.

త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తు న్నాయి. అధికారికంగా దీని ని ఎప్పుడు ప్రారంభిస్తారు అన్న విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. అయితే ఇటీవలే టాలీవుడ్ సినిమా పరిశ్రమలో జరుగుతున్న స్ట్రైక్ ల వల్ల ఈ సినిమా యొక్క షూటింగ్ పై ప్రభావం పడుతుందని దాని పట్ల సుకుమార్ నిరాశగా ఉన్నారని తెలుస్తుంది.ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు ఇలాం టి స్ట్రైకులు చేయడం సినిమా మొదలుపెట్టడానికి అడ్డంకిగా మారుతుందట. మరి ఈ చిత్రం మొదలయ్యే సమయానికి కూడా తమ స్ట్రైక్ ను ఆపివేస్తారా అనేది చూడాలి. వచ్చే ఏడాది ఏడాది విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రష్మిక మందన కథానాయకగా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: