దర్శకుడు హను రాఘవపూడి.. తెలుగు సినిమా పరిశ్రమకు దొరికిన ఒక సెన్సిబుల్ దర్శకుడు.. అందుకు కారణం ఆయన ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించే విధానమే. అంతకు ముందు ఎంతో మంది దర్శకులు ప్రేమకథా సినిమాలను రూపొందించి ప్రేక్షకులను ఆకట్టుకోగా ఆ తరువాత అంతటి స్థాయిలో ప్రేక్షకులను తన ప్రేమకథా చిత్రాలతో అలరించిన దర్శకుడు ఈ హను రాఘవపూడి. అయితే ఆయన సినిమాల యొక్క కాన్సెప్టులు బాగానే ఉంటాయి కానీ స్క్రీన్ ప్లే విషయంలో చేసే చిన్న పొరపాటే ఆయనకు అవి భారీ విజయాన్ని తెచ్చి పెట్టలేక పోతున్నాయి.

అందుకే ఈసారి ఆయన అన్ని విషయాలలో ఎంతో కేర్ తీసుకొని చేసిన సినిమా సీతారామం. దుల్కర్ సన్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన దక్కించుకుంటుంది. హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. ఆ విధంగా ఈ చిత్రం అన్ని విధాలుగా ప్రేక్షకులను సంతృప్తి పరచడం విశేషం. హను తన సినిమాల యొక్క ద్వితీయార్థంతో ఏ మాత్రం అలరించలేక పోతాడు అన్నది ఒక విమర్శ ఉండేది. ఈ సినిమాతో ఆ విమర్శను పూర్తిగా పోగొట్టాడని చెప్పాలి. మరి ఇకపై ఆమె చేసే సినిమాలు ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి. 

అందరూ రాక్షసి సినిమాతో తన దర్శకత్వ కెరియర్ను ప్రారంభించిన హను రాఘవపూడి ఆ తరువాత నానితో కలిసి చేసిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో మొదటి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత చేసిన సినిమాలు రెండు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి దాంతో సీతారామం తో ఇప్పుడు ఆయన చూపించిన ఈ కొత్తదనం ప్రేక్షకులను మరింత అలరిస్తుందని చెప్పవచ్చు. త్వరలోనే ఆయన చేయబోయే తదుపరి సినిమా యొక్క అనౌన్స్మెంట్ రాబోతుంది. మరి ఈసారి మళ్లీ ప్రేమ కథ జోనర్ లో సినిమా చేస్తాడా లేదా వేరే జోనర్ లో కథ రాస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: