అక్కినేని నాగచైతన్య చేస్తున్న బాలీవుడ్ చిత్రం లాల్ సింగ్ చద్దా చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంది. అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో బోడి బాలరాజు అనే పాత్రను చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. నాగచైతన్య తెలుగులో చాలా మంది హీరోలు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తుంటే నాగచైతన్య మాత్రం బాలీవుడ్ సినిమాలో నటించి పాన్ ఇండియా స్థాయిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

ఆ విధంగా ఈ చిత్రంతో ఆయన మంచి గుర్తింపు సంపాదించుకొని ఆ తర్వాత తాను హీరోగా ఒక పాన్ ఇండియా సినిమా చేయాలని భావిస్తున్నాడు. మరి ఈ ఫ లితం ఏ విధంగా ఆయన పాన్ ఇండియా కెరియర్ కు ఉపయోగపడుతుందో చూడాలి. అయితే ఇప్పుడు ఆయన తెలుగులో రెండు సినిమాలను చేస్తూ మరొక బాలీవుడ్ సినిమా చేసే విధంగా అడుగులు వేస్తున్నాడని అంటున్నారు. విక్రమ్ ప్రభు దర్శకత్వంలో ఒక ద్విభాషా చిత్రాన్ని చేస్తున్న నాగచైతన్య ఆ తరువాత పరశురామీ దర్శకత్వంలో ఒక మాస్ మసాలా చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నాడు.ఈ రెండు సినిమాలను కూడా ఒకేసారి చేయడానికి సిద్ధమవుతున్నాడు నాగచైతన్య. 

ఈ చిత్రాలు రెండు కూడా ఇంకా మొదలు కాకముందే తాను నటిస్తున్న బాలీవుడ్ సినిమా విడుదల కాకముందే ఆయన మరొక బాలీవుడ్ సినిమా చేయడా నికి నిర్ణయించుకోవడం అక్కినేని అభిమానులను నిజంగా సంతోషం కలిగిస్తుంది. బాలీవుడ్ లో ఆయనకు మంచి డిమాండ్ పెరిగిపోతుందని దీన్నిబట్టి చెప్పవచ్చు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి చాలామంది హీరోలు బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. అక్కడ హీరోలుగా రాణిస్తున్నారు. క్రేజ్ అందుకుంటున్నారు.   మరి ఈ రకంగా పాన్ ఇండియా కెరియర్ ను సెట్ చేసుకుంటున్న నాగచైతన్య ఏ విధమైన విజయాలను అందుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: