ఇక మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కి అయితే తెలుగులో కూడా చాలా మంచి క్రేజ్ ఉంది.పలు మలయాళం డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన దుల్కర్ మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి కూడా మరింత చేరువయ్యారు. తాజాగా సీతారామం సినిమాతో మరో డైరెక్ట్ తెలుగు సినిమాతో పలకరించాడు దుల్కర్.హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రష్మిక, సుమంత్ ఇంకా తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన సీతారామం నేడు ఆగస్టు 5 వ తేదీన సౌత్ భాషల్లో రిలీజ్ అయ్యింది. సీతారామం సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్ సల్మాన్ మరో సారి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు అనే టాక్ కూడా మెల్ల మెల్లగా వస్తుంది.ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ లుక్ ఇంకా అలాగే అతడి నటనకు యూత్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.


మలయాళ స్టార్ అయినా కూడా ఒక తెలుగు హీరోగా ఆయన్ను తెలుగు ప్రేక్షకులు బాగా స్వీకరించారు.. స్వీకరిస్తున్నారు. ఇంకా అలాగే దుల్కర్ కూడా నటన కూడా సినిమాకు హైలెట్‌గా నిలిచింది.తెలుగులో ఇక నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తానంటూ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ప్రకటించిన హీరో దుల్కర్ సల్మాన్ తన కొత్త సినిమా 'కింగ్ ఆఫ్ కొత' సినిమాను పట్టాలెక్కించేందుకు గాను సిద్ధం అయ్యాడు.సీతారామం సినిమా కోసం గత నెల రోజులుగా బాగా బిజీ బిజీ గా గడిపిన దుల్కర్ సల్మాన్ ఈ నెల కాస్త రెస్ట్ తీసుకొని ఇక వచ్చే నెల నుంచి కొత్త సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు.అయితే ఇక ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. దుల్కర్ సల్మాన్ తీయబోయే ఈ సినిమాలో హీరోయిన్‌గా మన తెలుగు స్టార్ హీరోయిన్ సమంత నటించనున్నట్లు సమాచారం తెలుస్తుంది.మరి దీంట్లో ఎంత నిజం వుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: