కానీ ప్రస్తుత కాలంలో పవన్ కళ్యాణ్ హాజరవుతున్న ఫంక్షన్లకు బండ్ల గణేష్ కు ఆహ్వానం అందడం లేదు. భీమ్లా నాయక్ సినిమా ఫంక్షన్ కి కూడా బండ్ల గణేష్ రాకుండా త్రివిక్రమ్ అడ్డుకున్నాడు అంటూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ అభిమానితో బండ్ల గణేష్ మాట్లాడిన ఆడియో కాల్ లీక్ కావడంతో పెద్ద రచ్చయింది. ఇక అందులో నిజం లేదని కాల్ రికార్డులో ఉంది తన వాయిస్ కాదు అని బండ్ల సమర్దించుకున్నాడు. త్రివిక్రమ్ ను బండ్ల గణేష్ దూషించాడని నమ్ముతున్న పవన్ కళ్యాణ్ అతన్ని దూరం పెట్టాడు అనేది ఇండస్ట్రీలో టాక్.. ఆ తర్వాత వీరిద్దరూ కలిసిన సందర్భాలు లేవు. దీంతో వారిద్దరి మధ్య దూరం పెరిగిందని అందరూ అనుకున్నారు
కానీ బండ్ల గణేష్ తాజాగా పవన్ కళ్యాణ్ నా దేవుడు పవన్ కళ్యాణ్ చిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే ఒక మూవీ చేయాలని కోరుకుంటున్నాను అని కామెంట్ చేశాడు. మిమ్మల్ని ప్రేమిస్తూ మీతో ప్రేమించబడుతూ సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ అంటే కామెంట్ చేసాడుం ఇవన్నీ చూస్తుంటే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి దగ్గర కావాలని చేస్తున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు.