బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే కెరియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం ఈమె బాలీవుడ్ పరిశ్రమలో టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. హీరోలతో రొమాంటిక్ పాత్రలతో పాటు నేడు ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించి తన సత్తా చాటుతోంది. ఇక సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తలుక్ మని మెరుస్తూ ఉంటుంది ముద్దుగుమ్మ. తాజాగా ఈ ముద్దుగుమ్మ కెరియర్ విషయానికి వస్తే ఎంట్రీ ఇచ్చి 15 సంవత్సరాలు అవుతుందట. మొదట కన్నడ సినీ పరిశ్రమలు ఐశ్వర్య అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు.


ఆ ఒక్క సినిమాతోనే కన్నడ పరిశ్రమలో ఎలాంటి లాభం లేదనుకొని బాలీవుడ్ వైపు తన దృష్టిని పెట్టింది అప్పటికే మోడలింగ్ రంగంలో బాగా పేరు సంపాదించిన దీపిక పడుకొనే అనుకోకుండా మొదటి సినిమాతోనే షారుఖ్ ఖాన్ తో నటించే అవకాశం లభించింది. ఇక ఆ తర్వాత ఓం శాంతి ఓం సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాలు దీపికా పడుకొనే పాత్ర హైలెట్గా నిలిచింది దీంతో స్టార్ హీరోలంతా హలో అవకాశాలు కల్పించారు యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు ప్రతి ఒక్కరితోనూ నటించింది ఈ ముద్దుగుమ్మ.


ఇప్పటివరకు 35 పైగా సినిమాలలో నటించింది. 15 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా దీపిక మనసుకు దగ్గరైన ఒక సినిమా గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది. తను నటించిన సినిమాలలో పీకు సినిమాలోని పాత్ర అంటే తనకు చాలా ఇష్టమని ప్రస్తుతం తన జీవితం దశ కూడా ఆ పాత్రకు చాలా దగ్గరగా ఉంటుంది అని నేను నా సోదరి ఇద్దరం ఆ పాత్రకి బాగా కనెక్ట్ అయ్యామని తెలియజేసింది దీపికా పడుకొనే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ తో కలసి ప్రాజెక్ట్ -k సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: