సాధారణంగా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం మరణం లేని వారు ఉంటారు. ఇంతకీ మరణం లేకపోవడం అంటే ఏమిటి అంటే.. చిత్ర పరిశ్రమలో నటించినఅన్ని రోజులు.. స్టార్ డమ్ కొనసాగినన్ని రోజులు.. భూమ్మీద బ్రతికినన్ని రోజులు మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో లేకపోయినా అసలు ఈ భూమ్మీద లేకపోయినా ఆ నటీనటుల పై  ప్రేక్షకులకు అదే అభిమానం అదే గౌరవం ఉంటుంది. ఇక ఇలాంటి మరణం లేని నటులు  కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు .  ఇలా మరణం లేని నటీమణులలో మహానటి సావిత్రి ఒకరు అని చెప్పాలి.


 అప్పట్లోనే హీరోలకు మంచి రెమ్యునరేషన్ తీసుకున్న సావిత్రి నటనకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు. నిజం  చెప్పాలంటే హీరోలను నిర్మాతలందరూ సావిత్రి ఇంటి ముందు క్యూ కట్టేవారు అని చెప్పాలి. తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన సావిత్రి తన నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసింది. కానీ సావిత్రి కెరియర్ లో మాత్రం ఒక్క అవార్డు కూడా దక్కించుకోలేక పోయింది అని చెప్పాలి. మహానటి అని ప్రేక్షకులు ఇచ్చిన బిరుదు తప్ప .. ఇండస్ట్రీ ఇచ్చిన బిరుదులు మాత్రం ఆమెకు ఏమీ లేవు.. అయితే చివరి రోజుల్లో మాత్రం దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ సావిత్రి కన్నుమూశారు. అయితే సావిత్రి కోమా లోకి వెళ్లే ముందు ఒక కోరిక కోరిందట.


 ఇక కోమాలోకి వెళ్ళిన తర్వాత సావిత్రి చివరికి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. కోమాలోకి వెళ్లే ముందు సావిత్రి కోరినా చివరి కోరిక ఏమిటి అంటే.. తను చనిపోయిన తర్వాత తన సమాధి పై ఒక వ్యాఖ్య రాయాలని చెప్పారట. మరణంలోనూ జీవితంలోనూ ఒక మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వతమైన విశ్రాంతిని పొందుతోంది. ఇక్కడికి ఎవరు వచ్చినా సానుభూతితో తమ కన్నీళ్ళని విడువనక్కర్లేదు. ఇండస్ట్రీలో కూడా ఎవరు హీనంగా చూడకుండా మరణం లేని ఆ సమాధిలో నిద్రిస్తున్న మహా ప్రతిభకు చిహ్నంగా ఒక పూలమాల ఉంచండి.. ఇదే మీరు నాకు ఇచ్చే గౌరవం అంటూ సావిత్రి తన సమాధి పై రాయమని చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి: