‘బాహుబలి 2’ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసిన ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగి పోయింది. అయితే ఆతరువాత ప్రభాస్ నటించిన ‘సాహో’ ‘రాథే శ్యామ్’ లు ఘోర పరాజయం చెందడంతో ప్రభాస్ మార్కెట్ కు సమస్యలు ఏర్పడతాయి అన్న అంచనాలు చాలామందికి వచ్చాయి. అయితే ఆ అంచనాలకు భిన్నంగా ప్రభాస్ మార్కెట్ మరింత పెరిగినట్లుగా లేటెస్ట్ గా జరిగిన ఒక సంఘటన రుజువు చేస్తోంది.


ప్రభాస్ శ్రీరాముడు గా ‘ఆదిపురుష్’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈమూవీని తీస్తున్నారు. ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడ ఇప్పటి  వరకు విడుదలకాలేదు. దీనితో ప్రభాస్ శ్రీరాముడు గా ఎలా ఉంటాడు అన్న విషయమై ఈసినిమా యూనిట్ కు తప్ప ఎవరికీ క్లారిటీ లేదు.


అయితే ఈవిషయాలు ఏమి పట్టించుకోకుండా ఈమూవీకి వచ్చిన ఓటీటీ బిజినెస్ ఆఫర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో షాకింగ్ న్యూస్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ‘ఆదిపురుష్’ ఓటీటీ రేట్స్ ను అన్ని భాషలకు కలిపి 250 కోట్లకు తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే ఇండియన్ ఫిలిం ఇందిస్త్రీలో ఇది ఒక రికార్డు అని అంటున్నారు.


కేవలం ఓటీటీ బిజినెస్ ద్వారా ఈమూవీ నిర్మాతలకు 250 కోట్లు వస్తే ఈమూవీ టోటల్ బిజినెస్ 750 కోట్ల స్థాయిని దాటినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. కేవలం దేశంలోని అన్ని ప్రముఖ భాషలలో ఈసినిమాను డబ్ చేసి విడుదల చేయడమే కాకుండా ఇంగ్లీష్ ఫ్రెంచ్ జపానీ జర్మన్ భాషలలో కూడ డబ్ చేసి ఈమూవీని ప్రపంచ వ్యాప్తంగా 5వేల ధియేటర్లలో విడుదల చేయడానికి మాష్టర్ ప్లాన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కాబోతున్న ఈమూవీ కలక్షన్స్ 2 వేల కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: