టాలీవుడ్ హీరోలు అందరు పాన్ ఇండియా హీరోలుగా మారాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ రామ్ చరణ్ జూనియర్ రానా లకు పాన్ ఇండియా ఇమేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ లిస్టులోకి చేరడానికి నాగచైతన్య కూడ ఈ నెలలో విడుదల కాబోతున్న ‘లాల్ సింగ్ చద్దా’ మూవీతో ప్రయత్నిస్తున్నాడు. దాదాపు నాలుగు సంవత్సరాలు తరువాత అమీర్ ఖాన్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈమూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.


దీనికి తగ్గట్టుగానే ఈమూవీ ప్రమోషన్ ను దేశం యావత్తు భారీ స్థాయిలో చేస్తున్నారు. వాస్తవానికి ఈమూవీలో నాగచైతన్య ది కేవలం ఒక కీలక పాత్ర అయినప్పటికీ అమీర్ ఖాన్ తో సమానంగా చైతూ ఈమూవీ ప్రమోషన్ కోసం దేశం యావత్తూ తిరుగుతున్నాడు. ఇక్కడే చైతన్య కు ఒక చిక్కు సమస్య వచ్చి పడింది అని తెలుస్తోంది. సాధారణంగా బాలీవుడ్ మీడియా సెలెబ్రెటీల వ్యక్తిగత జీవితాల గురించి చాల ఆశక్తి కనపరుస్తూ ఉంటుంది.


దీనితో బాలీవుడ్ మీడియా వర్గాలు సినిమా ప్రమోషన్ కోసం వచ్చే సెలెబ్రెటీల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడగడం పరిపాటి. ఇప్పుడు ఇదే పరిస్థితి ముంబాయిలో నాగచైతన్యకు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. సమంత నాగచైతన్యతో విడిపోయిన తరువాత బాలీవుడ్ లో చాల యాక్టివ్ గా ఉంటూ అక్కడ మీడియా సంస్థలకు తెగ ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఆ ఇంటర్వ్యూలలో సమంత తన వ్యక్తిగత జీవితం గురించి ముఖ్యంగా తన పెళ్ళి విడాకుల గురించి చాల ఎక్కువగా మాట్లాడుతోంది.


అయితే దీనికి భిన్నంగా చైతన్య ప్రవర్తిస్తూ బాలీవుడ్ ఇంటర్వ్యూలలో సమంతతో జరిగిన విడాకుల వ్యవహారం గురించి ఎక్కువగా మాట్లాడటానికి అంగీకరించడం లేదు. దీనితో తనకు ఎదురౌతున్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పే విషయంలో చైతూ ఇబ్బంది పడుతున్నాడు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నట్లు టాక్. అయితే తెలుగు మీడియాలో మాత్రం ఇలాంటి ప్రశ్నలు ఎదురవుకుండా చైతూ మేనేజ్ చేయగలుగుతున్నాడు. ఆవిధంగా చైతూ బాలీవుడ్ మీడియాను మేనేజ్ చేయలేకపోతున్నాడు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: