కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. నిజానికి మంచు మనోజ్ సినిమాల ద్వారా కంటే ఇతరులకు సేవ చేయడంలోనే ఎప్పుడూ ముందుంటాడు. అంతే కాదు ఇలాగే ఆయన బాగా పాపులారిటీ సొంతం చేసుకున్నాడని చెప్పవచ్చు. ఇండస్ట్రీలోనే కాదు బయట వారికి కూడా తన వంతు సహాయం చేస్తూ చిన్న వయసులోనే ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు మంచు మనోజ్. అంతేకాదు తెలంగాణ విదేశీ పర్యాటక విభాగంలో కూడా ఆయన భాగమయ్యారు. ఇకపోతే దొంగ దొంగది సినిమాతో హీరోగా తన సినీ కెరియర్ ను మొదలుపెట్టిన మంచు మనోజ్సినిమా ను చివరిగా ఒక్క మగాడు సినిమాతో ఆడియన్స్ ను అలరించాడు. చాలా రోజుల తర్వాత అహం బ్రహ్మాస్మి అనే మూవీ షూటింగ్ మొదలుపెట్టి చాలా రోజులవుతున్నా.. ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం గమనార్హం. ఇక ఈ క్రమంలోనే మంచు మనోజ్ ఇండస్ట్రీలోకి వచ్చి 18 సంవత్సరాలు పూర్తయింది.


ఇక ఈ క్రమంలోని ఒక ఎమోషనల్ పోస్ట్ చేయడం జరిగింది. మీ అందరి ప్రేమాభిమానాలకు నేను ఎప్పుడూ కృతజ్ఞుడి నై ఉంటాను. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో నా ప్రయాణానికి నేటితో 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇక ఈ జర్నీ నేను నటుడు గానే కాకుండా ఒక వ్యక్తిగా కూడా నాకు చాలా ప్రత్యేకమైనది. నిర్మాతలు,  ప్రేక్షకులు,  దర్శకులు, సాంకేతిక నిపుణులు, మీడియా మిత్రులు , సహనటులు ఇలా  ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పి సరిపెట్టలేను . మీరు నాపై చూపించిన ప్రేమ,  అభిమానం కారణం వల్లే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఇక నా మొదటి సినిమా నిర్మాతలు అశోక్ గారూ,  ఎన్. వి. ప్రసాద్ గారు నాపై మీకున్న విశ్వాసం ఈ పరిశ్రమలో నా ఎదుగుదలకు తోడ్పడింది.


సినిమా ఇండస్ట్రీకి దూరం కావడం కూడా చాలా అవసరమైన విరామం.. నేను సినిమాలతో మీ ముందుకు రాకున్నా.. నన్ను మీరు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. ఇక మా అమ్మ, నాన్న, అన్న, నా కుటుంబం, ప్రత్యేకించి అక్క.. వీరి ప్రేమ నన్ను మరింత దృఢంగా మార్చింది. ఇక నాకు చాలా సపోర్ట్ గా నిలిచినందుకు..ఇక మీ అందరి ఆశీర్వాదం తో నేను చాలా బలంగా.. దృఢంగా తయారవుతున్నాను. త్వరలోనే మీ ముందుకు వస్తాను.. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు మంచు మనోజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: