తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యున్నత స్థాయిని తీసుకువెళ్లిన స్టార్ హీరోలలో ఎన్టీఆర్ తర్వాత వినిపించే పేరు అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పాలి. నాటకాల నుంచి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అక్కినేని నాగేశ్వరరావు ప్రేక్షకులందరూ గర్వించదగ్గ హీరోగా ప్రస్థానాన్ని కొనసాగించారు. ఎన్నో అపురూపమైన పాత్రలు పోషించి కోట్ల మంది అభిమానుల ప్రేమ సంపాదించుకున్నారు ఆయన. ఒక వ్యక్తి తలచుకుంటే ఎంతటి ఎత్తైన ఎదగవచ్చు అనేదానికి అక్కినేని నాగేశ్వరరావు నిలువెత్తు నిదర్శనం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అక్కినేని నాగేశ్వర రావు జీవితం ఇక ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. అయితే అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు  ఇండస్ట్రీలో లవర్ బాయ్గా కూడా కొనసాగారు. అయితే నిజ జీవితంలో ఆయన అలాంటి ప్రభావం ఉన్న వ్యక్తి కాకపోయినప్పటికీ ఆయన చేసిన సినిమాల కారణంగా ఎక్కువమంది అమ్మాయిల ఫాలోయింగ్ ఆయనకు ఉండేది. ఇక ప్రేమ కథలలో నటించినప్పుడు పాత్రలో ఒదిగిపోయి ప్రాణం పోయడం మాత్రం అక్కినేనికి మాత్రమే సాధ్యమైంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు అన్ని సినిమాలు కూడా విగ్గు పెట్టుకుని చేశారు  అన్న విషయం తెలిసిందే. కానీ ఒక్క సినిమాలో మాత్రం విగ్గు పెట్టుకోకుండా నటించారట అక్కినేని. ఆ సినిమానే సీతారామయ్యగారి మనవరాలు. అక్కినేని గెటప్ విభిన్నంగా ఉంటే బాగుంటుందని దర్శకుడు క్రాంతికుమార్ చెప్పారట. కానీ ఇందుకు  అక్కినేని ఒప్పుకోలేదు. క్రాంతికుమార్ విగ్గు లేకుండా అక్కినేనిని నటింపజేయడానికి ఎంతగానో కష్టపడ్డారు. ఇక ఈ క్రమంలోనే మొదట విగ్గు లేకుండా కొన్ని స్టిల్స్ తీసి ఫైనలైజ్ చేస్తే విగ్గు లేకుండా అక్కినేని బాగున్నారని  అందరూ అన్నారట. ఈ క్రమంలోనే తోటి నటులు చెప్పడంతో ఇక విగ్గు లేకుండా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట అక్కినేని. ఇక ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Anr