టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తన నటన తో ఎలా అయితే ప్రేక్షకులను మెప్పిస్తారో తన కుటుంబాన్ని కూడా అంతే సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ తన సత్తా ఏంటో చాటుతున్నారు. ఇక తాజాగా పుష్ప సీక్వెల్ కూడా షూటింగ్ మొదలుకానుండగా అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తి అయితే సినిమా థియేటర్లలో అనుకున్న సమయానికి విడుదల అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇకపోతే వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదల చేయాలని షూటింగ్ మొదలుపెట్టినట్లు సమాచారం.

అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డికి కూడా సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా ఈమెను అభిమానించే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా బన్నీ భార్య బ్లాక్ కలర్ డ్రెస్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఈ ఫోటో కాస్త వైరల్ గా మారుతుంది. అంతేకాదు ఈ ఫోటో చూసిన నెటిజన్స్ కొంతమంది అక్క నువ్వు సూపర్ అంటూ కామెంట్ చేస్తుంటే మరొక నెటిజన్స్ మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఏకంగా స్నేహారెడ్డి పరమ సుందరి అంటూ కామెంట్ పెట్టడం గమనార్హం.ఇద్దరు పిల్లల తల్లి అయినా ఫిట్నెస్పై దృష్టి పెడుతూ మంచి గుర్తింపున సొంతం చేసుకుంటున్న ఈమె సినిమాలలో బన్నీ తో కలిసి నటిస్తే బాగుంటుంది అని నెటిజన్లు కూడా కోరుకుంటున్నారు. ఇక  2011 సంవత్సరం మార్చి నెల ఆరవ తేదీన వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న జోడీలలో అల్లు అర్జున్ స్నేహ రెడ్డి జోడి కూడా ఒకటి. వీరిద్దరికి ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: