ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన ఆహా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ వారు తమ ఖాతాదారులకు కొత్త కంటెంట్ ను ఇవ్వడం అలాగే కొత్త ఖాతాదారులను సృష్టించుకోవడం కోసం ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ ప్రతి వారం ఏదో ఒక కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ వారు ఆగస్ట్ నెలలో కూడా అద్భుతమైన కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆగస్ట్ నెలలో ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు , షో లకు సంబంధించిన వివరాలను తాజాగా విడుదల చేసింది. 

ఇందులోభాగంగా ఇప్పటికే ఆగస్ట్ 5 వ  తేదీన ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ పక్కా కమర్షియల్ మూవీ ని తమ  'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తోంది.  ఏజెంట్ ఆనంద్ సంతోష్ వెబ్ సిరీస్ కు సంబంధించిన 4 వ ఎపిసోడ్ ఆగస్ట్ 12 వ తేదీన, 5 ఎపిసోడ్ ని ఆగస్ట్ 19 వ తేదీన, 6 వ ఎపిసోడ్ ని ఆగస్ట్ 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ ప్రకటించింది. మహా మనిషి మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన ,  మాలిక్ మూవీ ని ఆగస్ట్ 12 వ , తేదీన హైవే మూవీ ని ఆగస్ట్ 19 వ తేదీన,  డ్యాన్స్ ఐకాన్ ప్రోగ్రాం ని ఆగస్ట్ 28 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ఆహా  నిర్వహణ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇలా ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ వారు ఆగస్ట్ నెలలో విడుదల చేయబోయే కంటెంట్ కి సంబంధించిన వివరాలను తాజాగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: