ప్రేమ కథలను అద్భుతంగా వెండి తెరపై తెరకెక్కిస్తారు అని పేరు కలిగిన దర్శకులలో ఒకరైన హను రాఘవపూడి తాజాగా సీతా రామం అనే ప్రేమ కథా చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా , మృణాళిని ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మూవీ తాజాగా  ఆగస్ట్ 5 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ మూవీ కి మొదటి రోజే అద్భుతమైన బ్లాక్ బస్టర్ టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభించింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ 'ఓ టి టి' హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వారు దక్కించుకున్నట్లు , థియేటర్ రన్ 8 నుండి 10 వారాలు ముగిసిన తర్వాత అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఈ మూవీ లో రష్మిక మందన కీలక పాత్రలో నటించగా ,  సుమంత్ , తరుణ్  భాస్కర్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్ ,  భూమిక చావ్లా ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. వీరితో పాటు ప్రకాష్ రాజ్ , సునీల్ , ప్రియదర్శి ఇతర పాత్రలో నటించారు. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ లపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: