సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు . కానీ వారిలో కొంత మంది కి మాత్రమే నటించిన మొదటి మూవీ తో మంచి విజయాలు బాక్సా ఫీస్ దగ్గర లభిస్తుంటాయి . అలా నటించిన మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న అతి కొద్ది మంది హీరోయిన్ లలో సదా ఒకరు . 

సదా  'జయం' మూవీ తో హీరోయిన్ గా తన కెరీర్ ని మొదలు పెట్టింది . ఈ మూవీ తో మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా, ఫుల్ క్రేజ్ ను కూడా సదా అందుకుంది. ఆ తర్వాత అనేక సినిమాలలో నటించిన సదా తెలుగు మరియు తమిళ భాషలలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా చాలా సంవత్సరాల పాటు కొనసాగింది. ప్రస్తుతం సదా వీలుచిక్కినప్పుడల్లా మూవీ లలో నటిస్తూ కొన్ని టీవీ షో లకు జడ్జి గా కూడా వ్యవహరిస్తోంది. ఇలా సినిమాలతో ,  టీవీ షో లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న సదా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియా ద్వారా ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులకు తెలియజేస్తూ ఉంటుంది. 

అలాగే అప్పు డప్పుడు సదా తనకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ తన  ఇన్ స్టా లో  కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో సదా డిఫరెంట్ లుక్ లో ఉన్న పొడవాటి  షర్ట్ ని వేసుకొని, డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సదా కు సంబంధించిన ఈ ఫోటోలు నెటింట తెగ  వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: