ప్రేమ కథల స్పెషలిస్ట్ అయిన హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన సీతా రామం సినిమా తాజాగా థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన ఒక కీలక ప్రధాన పాత్రలో నటించగా , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ,  సుమంత్ , భూమిక చావ్లా ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సునీల్ , ప్రకాష్ రాజ్ , ప్రియదర్శిమూవీ లో ఇతర పాత్రల్లో నటించారు.

మూవీ ని వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మించారు. ఆగస్ట్ 5 వ తేదీన విడుదల అయిన సీతా రామం సినిమా మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సీతా రామం సినిమా గురించి రవితేజ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

సోషల్ మీడియా వేదికగా రవితేజ స్పందిస్తూ... ఇప్పుడే సీతా రామం మూవీ ని చూశాను. హీరో దుల్కర్ సల్మాన్ ,  హీరోయిన్ మృణాళినీ ఠాకూర్ , దర్శకుడు హను రాఘవపూడి ,  సంగీత దర్శకుడు విశాల్సినిమా కోసం అద్భుతంగా పని చేశారు, వారి కళా ప్రదర్శనకు అభినందనలు.  అలాగే స్వప్న దత్ మరియు వైజయంతి ఫిలిమ్స్ బృందానికి అభినందనలు. థియేటర్ లలో ఈ క్లాసిక్ మూవీ ని మిస్ కాకండి అంటూ రవి తేజ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: