నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ మూవీ ల ద్వారా వెండి తెరకు పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమాల ద్వారా ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం రష్మిక మందన బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ జోష్ లో తన కెరీర్ ని ముందుకు సాగిస్తోంది. తాజాగా విడుదల అయిన సీతా రామం మూవీ లో రష్మిక మందన ఒక కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ లో రష్మిక మందన పాత్రకు ఇటు ప్రేక్షకుల నుండి, అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అల్లు అర్జున్ హీరోగా నటించగా , సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో రష్మిక మందన కు కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ లభించింది. మరి కొన్ని రోజుల్లో పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు రష్మిక మందన కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... పుష్ప ది రూల్ మూవీ కి గాను రష్మిక మందన 4 కోట్ల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: