టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినా నిఖిల్ తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే . ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది . కార్తికేయ మూవీ లో నిఖిల్ హీరోగా నటించగా కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించింది . చందు మొండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ లో నిఖిల్ మరియు కలర్స్ స్వాతి జంటకు ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి .

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం కార్తికేయ 2 మూవీ ని తెరకెక్కిస్తున్నారు అని ప్రకటించడం,  కార్తికేయ మూవీ కి కార్తికేయ 2 మూవీ కొనసాగింపుగా ఉంటుంది అని మూవీ మేకర్స్ ప్రకటించడంతో కార్తికేయ 2 మూవీ లో నిఖిల్ సరసన కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటిస్తోంది అని అంతా భావించారు. కానీ చివరగా మూవీ కార్తికేయ 2 మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు మూవీ యూనిట్ అధికారిక ప్రకటన చేసింది.

దానితో కలర్స్ స్వాతి ని పక్కన పెట్టారు అని వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించిన నిఖిల్... కార్తికేయ 2 మూవీ కథా పరంగా నార్త్ ఇండియన్ లుక్ ఉన్న అమ్మాయి కావాలి. అందువలన ఈ మూవీ లో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకోవడం జరిగింది. అంతే గానీ స్వాతిని కావాలని పక్కన పెట్టలేదు అంటూ తాజాగా నిఖిల్ చెప్పుకొచ్చాడు. కార్తికేయ 2 మూవీ కి చందు మొండేటి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఆగస్ట్ 13 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: