బింబిసార సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఇంకా వెబ్ మీడియా వేదికగా మల్లిడి వశిష్ట గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ప్రేమలేఖ రాశా సినిమాలో హీరోగా నటించిన వశిష్ట డైరెక్టర్ గా మారి తొలి సినిమాతోనే మాంచి సూపర్ సక్సెస్ ను అందుకున్నారు. ఈ సినిమా రిలీజ్ కు ముందే ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ ఉన్న వశిష్ట తన నమ్మకం నిజమవుతుందని ఈ సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు.బింబిసార హిట్ తో స్టార్ డైరెక్టర్ల జాబితాలో వశిష్ట చేరినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బింబిసార సినిమాను చూసిన ప్రేక్షకులెవరూ కూడా అసలు కొత్త డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడంటే నమ్మడం లేదు.తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు కూడా అనుభవం ఉన్న దర్శకుడిలా వశిష్ట ఈ సినిమాను చాలా బాగా డీల్ చేయడం గమనార్హం. స్టార్ హీరోలను సైతం హ్యాండిల్ చేయగలనని వశిష్ట ఈ సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు.


ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల జాబితాలో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా వున్నారు.ఇక ఈ జాబితాలో అతి త్వరలో మల్లిడి వశిష్ట కూడా చేరే అవకాశాలు అయితే ఉన్నాయి. స్టార్ హీరోలు ఛాన్స్ ఇస్తే దర్శకుడిగా మల్లిడి వశిష్ట రేంజ్ కూడా మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సాధారణంగా కొత్త డైరెక్టర్లు సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ లకు చాలా దూరంగా ఉంటారు. అయితే వశిష్ట మాత్రం చాలా రిస్కీ సబ్జెక్ట్ ను ఎంచుకోవడంతో పాటు ఆ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోవడం గొప్ప విషయం.బింబిసార పార్ట్ సినిమా2 కూడా ఉంటుందని కళ్యాణ్ రామ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ ను మించిన ట్విస్టులతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అలాగే బింబిసార పార్ట్2 లో అత్యున్నత గ్రాఫిక్స్ హంగులు ఉంటాయని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది బింబిసార2 సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: