‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలై 5నెలలు దాటిపోవడంతో రాజమౌళి తన రెస్ట్ మూడ్ నుండి బయటకు వచ్చి మహేష్ తో తీయబోయే మూవీ కథ గురించి ఆలోచనలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు మహేష్ తో రాజమౌళి తీయవలసిన సినిమా కథ చర్చలు కూడ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది.


ముందుగా అనుకున్న ప్రకారం కొత్త సంవత్సరం 2023 జనవరి నుండి మహేష్ పూర్తిగా ఫ్రీ అయిపోతే రాజమౌళి తీయబోయే మూవీ కథకు సంబంధించిన వర్క్ షాపులకు అదేవిధంగా మహేష్ పాత్రకు సంబంధించిన మేకోవర్ కు కనీసం మహేష్ 6నెలలు తన సమయాన్ని కేటాయించగలిగితే ఆతరువాత అన్నీ కుదిరితే 2023 జూలై లేదా ఆగష్టు నుండి తన మూవీ షూటింగ్ ప్రారంభించి ఈమూవీని 2024 చివరకు కానీ లేదంటే 2025 సంక్రాంతికి కానీ విడుదల చేయాలి అని జక్కన్న భావించినట్లు తెలుస్తోంది.


అయితే ఇప్పుడు ఈయాక్షన్ ప్లాన్ మరింత ఆలస్యం అవుతుందని అంటున్నారు. త్రివిక్రమ్ మహేష్ ల మూవీ షూటింగ్ ఈనెలలో మొదలై వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్న షూటింగ్ ల బంద్ వ్యవహారం ఎప్పటికి ఒక కొలిక్కి వస్తుందో తెలియని పరిస్థితి. ఈవిషయమై ప్రస్తుతం ఇండస్ట్రీ రెండు ముక్కలుగా విడిపోయింది అని అంటున్నారు.


ఈపరిస్థితి పూర్తిగా చక్కబడాలి అంటే మరో రెండు నెలలు గడిచినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. అప్పటివరకు త్రివిక్రమ్ మహేష్ ల మూవీ పట్టాలు ఎక్కే పరిస్థితిలేదు. దీనితో ఈ ఆలస్యం రాజమౌళి మహేష్ తో తీయబోయే మూవీ పై ఖచ్చితంగా ప్రభావం చూపించి ఆమూవీ మరింత ఆలస్యం అయినా ఆశ్చర్యం లేదు అంటూ ఇండస్ట్రీలో వార్తల హడావిడి. సాధారణంగా రాజమౌళి ఒక సీన్ ను కనీసం 10 సార్లు తీస్తాడు అన్న ప్రచారం ఉంది. మరి మహేష్ సినిమాలో కూడ జరిగితే ఎప్పటికి ఆమూవీ విడుదల అవుతుందో తెలియని పరిస్థితి..  






మరింత సమాచారం తెలుసుకోండి: