ఒక హీరో చేయవలసిన సినిమా మరో హీరో దగ్గరకు వెళ్ళడం అలాగే ఒక హీరోయిన్ చేయవలసిన సినిమా మరో హీరోయిన్ దగ్గరకు వెళ్ళడం ఇండస్ట్రీలో సర్వసాధారణంగా వినిపించే మాటలు. అయితే పూజా హెగ్డే కి వచ్చిన కరోనా మృణాల్ ఠాకూర్ కు అదృష్టాన్ని తెచ్చిపెట్టడం ఇండస్ట్రీ వర్గాలలో షాకింగ్ న్యూస్ గా మారింది.


వాస్తవానికి ‘సీతా రామం’ మూవీలో సీత పాత్రకు పూజా హెగ్డే ని ఎంపిక చేయడం ఆమెకు అడ్వాన్స్ ఇవ్వడం చాలామందికి తెలియని విషయాలు. ఈమూవీకి దర్శకత్వం వహించిన హను రాఘవపూడి మనసులో ఈ స్క్రిప్ట్ వ్రాసేడప్పుడు సీత పాత్రకు పూజా హెగ్డే మాత్రమే న్యాయం చేయగలదు అని అనుకోవడంతో అతడు పూజా హెగ్డే దగ్గరకు వెళ్ళి ఆమెకు సీత పాత్రను వివరించడంతో అటువంటి పాత్ర తనకు లభించడం తన అదృష్టం అని చెప్పి తన పారితోషికాన్ని కూడ చాల తగ్గించుకుందట.


అయితే ఈమూవీ షూటింగ్ కు సర్వం సిద్ధం అయి ఈమూవీ యూనిట్ రష్యా వెళ్ళడానికి సిద్ధం అవుతున్న పరిస్థితులలో పూజా హెగ్డే కు కరోనా వైరస్ రావడంతో ఆమె రష్యా వెళ్ళే పరిస్థితులలో లేదట. దీనితో హీరోయిన్ గా ఎవర్ని ఎంపిక చేయాలి అని చర్చలు జరుపుతున్న పరిస్థితులలో మృణాల్ ఠాకూర్ నటనను ఒక హిందీ టివి సేరియల్ లో చూసిన నిర్మాత స్వప్నా దత్ ఆమె పేరును సూచించడం ఆమె కేవలం రోజుల వ్యవధిలో ఆమె షూటింగ్ స్పాట్ కు వచ్చేయడం అన్నీ చకచకా జరిగిపోయాదట.


ఇప్పుడు ఈవిషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మృణాల్ అదృష్టాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి పూజా హెగ్డే ప్రస్తుతం వరస ఫెయిల్యూర్స్ లో ఉంది. దీనితో ఆమెను ఐరన్ లెగ్ బ్యూటీగా కొంతమంది ఆమె పై సోషల్ మీడియాలో సెటైర్లు కూడ వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో పూజా హెగ్డే నిజంగా ఈమూవీలో నటించి ఉంటే ఆమె పేరు మారుమ్రోగిపోయి ఆమె పారితోషికం మరింత పెరిగి పోయేది..  
మరింత సమాచారం తెలుసుకోండి: