జూనియర్ ఎన్టీఆర్ తన ఆరోగ్య విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. దీనికితోడు ఆహార నియమాలలో కూడ తారక్ అనేక విధాలుగా శ్రద్ధ కనిపిస్తూ ఉంటాడు. దీనితో ఫిజికల్ గా అతడి ఆరోగ్యంలో ఎటువంటి సమస్యలు తలెత్తవు.


అయితే కొరటాల శివ సినిమాకు సంబంధించి తారక్ ఆ పాత్ర రీత్యా బరువు తగ్గవలసి ఉన్న నేపధ్యంలో ఆవిషయంలో జూనియర్ లో మార్పులు లేకుండా ఇంకా గుబురు గడ్డంతో లావుగా ‘బింబిసార’ మూవీ ఫంక్షన్ లో కనిపించడంతో తారక్ కొరటాల శివ సినిమాకు ఇంకా రెడీ అయ్యే ఉద్దేశ్యంలో లేడా అంటూ కామెంట్స్ వచ్చాయి. మరికొందరైతే కొరటాల శివ కథ ఇంకా రెడీ కాలేదు అంటూ మరికొందరు ఊహాగానాలు చేసారు.అయితే అసలు విషయం వేరు అంటూ ఇప్పుడు సరికొత్త ప్రచారం మొదలైంది. ఇప్పుడు ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం గత కొంత కాలంగా జూనియర్ కు విపరీతమైన భుజం నడుం నొప్పి వెంటాడుతోంది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ నొప్పితోనే ‘బింబిసార’ మూవీ ఫంక్షన్ కు తారక్ వచ్చి ఆతరువాత రెస్ట్ కోసం ఒక వారంరోజులు లండన్ వెళ్ళి వచ్చాడు అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారంమేరకు డాక్టర్లు అతడికి నాలుగు వారాలు కనీసం రెస్ట్ తీసుకోమని ఎటువంటి యాక్షన్ సీన్స్ చేయవద్దని డాక్టర్లు సలహా ఇచ్చినట్లు టాక్.


అయితే జూనియర్ కు ఇంత విపరీతమైన ఇంత విపరీతమైన భుజం నడుం నొప్పి ఎందుకు వచ్చింది అన్న విషయమై క్లారిటీ లేకపోయినప్పటికి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని విపరీతమైన యాక్షన్ సీన్స్ కోసం తారక్ పడిన కఠోర శ్రమ వల్ల ఇలాంటి సమస్యలు తారక్ ఏర్పడ్డాయా అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నాయి. ఈ వార్తలే నిజం అయితే కొరటాల శివ జూనియర్మూవీ షూటింగ్ ప్రారంభానికి మరింత ఆలస్యం జరిగి ఈమూవీ షూటింగ్ పూర్తి కావడానికి చాల సమయం పట్టే ఆస్కారం ఉంది..మరింత సమాచారం తెలుసుకోండి: