టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు పుట్టినరోజు కావడం చేత అభిమానుల సైతం పెద్ద ఎత్తున మీ పుట్టినరోజు వేడుకలను జరుపుతున్నారు ఇక అంతే కాకుండా ఈసారి ట్రెండ్ సెట్ చేసే విధంగా పోకిరి సినిమాని మరొకసారి గుర్తుకు చేసుకుంటూ థియేటర్లలో విడుదల చేసి నానా హంగామా చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఇదివరకే చాలా సెంటర్లలో ఒక్కడు సినిమాను విడుదల చేయగా అభిమానుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది.


మహేష్ బాబు కెరియర్ లోనే ఒక్కడు, పోకిరి సినిమాలు ఒక వండర్స్ క్రియేట్ చేశాయని చెప్పవచ్చు ఇక ఇలాంటి సినిమాలు మళ్లీ థియేటర్లలో చూడాలని అభిమానులు కోరుకోవడంతో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సైతం అభిమానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక కొన్ని సెంటర్లలో 20 లేదా 50 స్క్రీన్ లలో ఈ సినిమాను ప్రదర్శించడం జరుగుతుంది ఇక అభిమానులు తాకిడికి మరింత ఎక్కువ కావడంతో టికెట్ల కోసం ముందుగానే సంప్రదింపులు కూడా జరుగుతున్నారు దీంతో ఈ షోల సంఖ్య పెంచే అవకాశం కూడా ఉన్నది.

ఇక నేడు టెక్నాలజీ ఉపయోగించి ఈ సినిమాను 4k లోకి కన్వర్ట్ చేసి ఈరోజు ఈ సినిమాలను రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రదర్శించారు. ఇక ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి.కాగా పోకిరి సినిమా హౌస్ ఫుల్ కావడం గౌమనార్హం. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా పలుచోట్ల ఈ సినిమాని స్పెషల్ షో ని వేయడం జరిగింది రీ రిలీజ్ చేసిన తర్వాత ఈ స్థాయిలో రెస్పాన్స్ అందుకోవడం ఇదే మొదటి సినిమాగా నిలిచింది పోకిరి. ముఖ్యంగా యుఎస్లో మహేష్ బాబుకు మంచి డిమాండ్ ఉండాలని చెప్పవచ్చు అక్కడ 25 వేలకు పైగా ప్రదర్శించగా.. అందుకు సంబంధించి టికెట్లు కూడా రెండు రోజులు ముందుగా హౌస్ ఫుల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: