సొట్టబుగ్గల సుందరి తాప్సీ, మంచు మనోజ్ హీరోగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఝుమ్మంది నాదం మూవీ తో హీరోయిన్ గా కెరీర్ ని మొదలు పెట్టింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం అలాగే ఈ మూవీ లో తాప్సీ తన నటనతో , అంతకుమించిన అందచందాలతో ప్రేక్షకులను అలరించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కాయి. ఇందులోభాగంగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన సినిమాలు కూడా కొన్ని మంచి విజయాలను సాధించాయి.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వున్న హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే తాప్సి బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా తాప్సి బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం మూవీ లు మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తాప్సి మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తోంది. ఇది ఇలా ఉంటే తాప్సీ తాజాగా 'దోబరా' అనే మూవీ లో నటించింది. ప్రస్తుతం తాప్సీ ఈ మూవీ ప్రమోషన్ లలో పాల్గొంటుంది. ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా తాప్సీకి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.  

ఈ ప్రశ్నకు తాప్సి కూడా అంతే ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. అసలు విషయం లోకి వెళితే... దోబరా మూవీ ప్రమోషన్ లలో భాగంగా తాప్సీ ...  కాఫీ విత్ కరణ్ షో కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. కరణ్ జోహార్ తన షో లో నటీనటుల శృంగార జీవితాలపై ఎక్కువ ప్రస్తావిస్తూ ఉంటాడు అని పేర్కొంది. ఆ తరువాత కాఫీ విత్ కరణ్ షో నుండి మీకు ఆహ్వానం అందలేద అనే ప్రశ్న తాప్సి కి ఎదురైంది ... ఈ షో కు ఆహ్వానించేంత ఆసక్తికరంగా నా శ్రుంగార జీవితం లేదు అని వ్యంగ్యంగా తాప్సి సమాధానం ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: