మాస్ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ కలిగి ఉన్న రవితేజ గత కొన్ని చిత్రాలుగా వరుస ప్లాపులను ఎదుర్కొంటు న్నాడు. అయినా కూడా సినిమాలను ఒప్పుకునే విషయంలో ఏ మాత్రం తగ్గకుండా ఒకదాని వెంట మరొకటి చేసుకుంటూనే పోతున్నాడు. ఒకేసారి ఆయన ఇప్పుడు మూడు చిత్రాలను చేస్తుం డడం విశేషం. తొందరలోనే త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ధమాకా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందింది.

ఈ సినిమాలో పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఆ తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొం దిన రావణాసుర చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు రవితేజ. వెరైటీ కథాకథనాలతో కూడిన ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమాను కూడా చేయడానికి సిద్ధమవుతున్నాడు ఈ హీరో. అలా ఈ మూడు చిత్రాలతో వాటి షూటింగ్లతో బిజీగా ఉన్న రవితేజ ఇప్పుడు ఆ తదుపరి సినిమాను కూడా చేయ డానికి సిద్ధమవుతున్నాడట.

మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ కలిగిన దర్శకుడు శ్రీవాస్ ఇటీవలే రవితేజకు ఓ లైన్ ను వినిపించగా దానిని డెవ లప్ చేయమని రవితేజ వెల్లడించాడట. మరి కథను రవితేజకు నచ్చినట్లుగా చేసి ఆ చిత్రాన్ని ఒకే చేసుకుంటాడా అనేది చూడాలి. ప్రస్తుతం గోపీచంద్ తో కలిసి శ్రీవాస్ ఒక మాస్ మసాలా సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన రవితేజ సినిమా యొక్క పనులను మొదలు పెట్టబోతున్నాడు.  మరి తొలిసారి మీరు కలయికలో రాబోతున్న ఈ చిత్రం ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఓ వైపు రవితేజ చక చకా సినిమాలు చేసుకుంటూ పోతూ ఉండడం ఆయన అభిమానులను అలరిస్తున్నా కూడా ఎందుకో విజయాలు అందుకోకపోవడం వారిని మరింత కలవరపెడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: