సినిమా పరిశ్రమలోకి వారసులు రావడం అనేది సహజం. గతంలో హీరోలు మాత్రమే వారసత్వంతో సినిమా పరిశ్రమలోకి వచ్చేవారు. ఇప్పుడు హీరో యిన్ లు కూడా సినిమా పరిశ్రమలోకి వారసత్వంగా రావడం మొదలయ్యింది. ఆ విధంగా తమిళనాడు లో అగ్ర హీరోగా ఉన్న నటుడు కమలహాసన్ తెలుగులో కూడా మంచి క్రేజ్ కలిగి ఉన్నాడు. ఆయన కూతురు శృతిహాసన్ కూడా సినిమా పరిశ్రమకు వచ్చి హీరోయిన్ గా అలరించడం విశేషం. అయితే తాను కమలహాసన్ కూతురిగా సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పటికీ ఆయన కూతురుగా ఉన్న కారణంగా అవకాశాలు దక్కించుకోలేదని చెబుతుంది.

తనకు ఎవరు రికమండేషన్ చేయలేదని తన టాలెంట్ పరంగానే సినిమా అవకాశాలు వచ్చాయని ఆమె చెబుతుంది. తండ్రి ఒక పెద్ద సూ పర్ స్టార్ అయిన కారణంగా ఆమెకు అవకాశాలు వచ్చాయని చాలామంది అనుకునే ఆస్కారం లేకపోలేదు. తల్లి కూడా ఒకప్పుడు సినిమాల్లో నటించిన హీరోయిన్ కాబట్టి ఈమెకు అవకాశాలు రాకపోవడం అంటూ జరగదు అని చాలామంది అనుకునే ఉంటారు.

ఈ నేపథ్యంలో తనకు సినిమా అవకాశాలు రావడానికి తన తల్లిదండ్రులకు ఏమాత్రం సంబంధం లేదని తాను స్వతహాగా సినిమా అవకా శాలను అందుకోవడానికి చాలా కష్టపడ్డాను అని ఆమె చెబుతుంది. ఎంత కష్టపడ్డా కూడా కమలహాసన్ కూతురు అన్న ట్యాగ్ ఉన్న కారణంగానే ఆమె ఇంత త్వరగా హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది అని కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో మూడు చిత్రాలను చేస్తుంది ఒకటి మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్న ఆమె బాలకృష్ణ మరియు ప్రభాస్ హీరోలుగా నటిస్తున్న సినిమాలలో కూడా హీరోయిన్ గా చేస్తుంది. మరి ఆ చిత్రాలు ఆమెకు మునుపటి వైభవాన్ని తీసుకువస్తాయా అనేది చూడాలి. ఇప్ప టికే ఆమె సీనియర్ హీరోల సరసన అవకాశాలు వస్తున్నాయని ఆమె అభిమానులు వాపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: