టాలీవుడ్ సినిమా పరిశ్రమలో చబ్బీ అమ్మాయిగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది రాశీ కన్నా. ఆమె స్టార్ హీరోయిన్ కాకపోయినా కూడా పెద్ద హీరోల సరసన నటించబోయే హీరోయిన్ల జాబితాలో ఈమె కూడా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇప్పుడిప్పుడే ఆమె పెద్ద హీరోల సినిమాలలో నటించడానికి అవకాశాలు అందుకుంటుంది. టైర్2 హీరోలకు ఈమె మొదటి ఆప్షన్ గా నిలవడం నిజంగా ఆమె అభిమానులను ఎంతగానో అలరిస్తుంది అని చెప్పవచ్చు.

అయితే సినిమా పరిశ్రమ అన్నాక సక్సెస్ బాగా ఉన్న హీరోయిన్ లకు మాత్రమే అవకాశాలు వస్తూ ఉంటాయి. అలాంటి వారితో నటించడం అదృష్టంగా భావిస్తూ ఉంటారు హీరోలు. అంతేగాక వారితో నటిస్తే సక్సెస్ కూడా వరిస్తుంది అన్నది వారి ఆలోచన. అందుకే గుడ్ లక్ ఉన్న హీరోయిన్ ల సరసన నటించడానికి హీరోలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే మొదట్లో మంచి విజయాలను అందుకున్న రాశీ కన్నా ఆ తరువాత విజయాలను అందుకోవడంలో మాత్రం విఫలం అవుతుంది. దాంతో ఆమెకు సినిమా అవకాశాలు ఇవ్వడానికి చిన్న హీరోలు సైతం భయపడుతూ ఉండడం ఆమెకు కెరియర్ క్లోజ్ అయ్యింది అన్న సంకేతాలను చూపిస్తుంది.

ఆమె ఇటీవలే నటించిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవడంతో ఆమె నటించబోయే తదుపరి సినిమాలపై భారీ ఎఫెక్ట్ పడిందని చెప్పవచ్చు. మారుతి దర్శకత్వంలో రూపొందిన పక్కా కమర్షియల్ చిత్రంలో ఆమె పాత్రకు మంచి పేరు వచ్చినా కూడా ఆ సినిమా కమర్షియల్ గా ప్రేక్షకులను మెప్పించకపోవడం ఈమెకు అంతగా గుర్తింపు రాకుండా పోయింది. దానికి తోడు ఇటీవల విడుదలైన మరొక సినిమా కూడా ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచింది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ చిత్రం భారీగా ఫ్లాప్ కావడంతో ఆమెకు అవకాశం ఇవ్వడానికి అందరూ ఆలోచన చేస్తున్నారు. మరి ఈమె మళ్లీ అవకాశాలు ఏ విధంగా దక్కించుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: